కొడుకును కట్టేసి, కారం పెట్టిన తల్లి.. ఎందుకో తెలుసా?
Publish Date:Apr 4, 2022
Advertisement
హైదరాబాద్ పబ్‌లో డ్రగ్స్ కలకలం. మత్తు పదార్థాలతో పాటు గంజాయి వాడిన ఆనవాళ్లూ ఉన్నాయి. అంతా హై-ఫై ఫ్యామిలీ పిల్లలే. వారికి అలాంటి పబ్బులు, డ్రగ్స్ చాలా కామన్ అనే ఆరోపణ ఉంది. పేరెంట్స్ పర్యవేక్షణ లేకపోవడం వల్లే.. రిచ్ కిడ్స్ అలా రెచ్చిపోతున్నారనేది ప్రధాన ఆరోపణ. సంపన్నులు నిత్యం వారి వ్యాపారాల్లో బిజీగా ఉంటూ.. పిల్లలను పట్టించుకోకపోవడమే యువతలో డ్రగ్స్ అలవాటు పెరిగేందుకు కారణం అంటారు. ధనిక కుటుంబాల తీరు ఇలా ఉంటే.. ఇక పేద, మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు తమ పిల్లలను డీల్ చేసే విధానం వేరేలా ఉంటుంది. అందుకు, తాజాగా జరిగిన కోదాడ ఘటన బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది. 15 ఏళ్ల కొడుకు. స్కూల్‌కు వెళ్లకుండా మత్తుకు బానిసయ్యాడు. చెడు స్నేహాలతో గంజాయికి అలవాటు పడ్డాడు. పలుమార్లు మత్తులోనే ఇంటికొచ్చాడు. వద్దు.. గంజాయి జోలికి పోవద్దు.. అది జీవితాలను నాశనం చేస్తుందని కొడుకును తల్లిదండ్రులు వారించినా వినలేదు. గంజాయి అలవాటు మానలేదు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆ తల్లిని ఓపిక నశించింది.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గంజాయి తాగి ఇంటికొచ్చిన కొడుకును స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పోసి దేహశుద్ధి చేసింది. సూర్యాపేట జిల్లా కోదాడలోని గాంధీనగర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. కళ్లలో కారం కొట్టడంతో ఆ బాలుడు బాధతో విలవిల అరిచాడు. తప్పైంది అమ్మా.. ఇంకెప్పుడూ గంజాయి తాగనంటూ వేడుకున్నాడు. ఎంతైనా కన్నతల్లి కదా.. కొడుకు అలా విలవిల్లాడిపోతుండటంతో చూడలేకపోయింది. గంజాయి మానేస్తానని కొడుకు మాట ఇవ్వడంతో ఆ అమ్మ శాంతించింది. కొడుకు కళ్లలో పడిన కారాన్ని నీళ్లతో కడిగేసి అక్కున చేర్చుకుంది. ఇంకెప్పుడూ గంజాయి తాగొద్దంటూ కుమారుడిని బాధతో వేడుకుంది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ తల్లి చేసిన పనిని అంతా ప్రశంసిస్తున్నారు. సంపన్న కుటుంబాల పేరెంట్స్ కూడా పిల్లలను ఇలా కంట్రోల్ చేసి.. మత్తు వదిలిస్తే మంచిదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
http://www.teluguone.com/news/content/kodada-mother-beats-her-son-for-using-ganja-39-133903.html





