సజ్జల సైలెంట్!.. రీజన్ అదేనా?

Publish Date:Apr 4, 2022

Advertisement

వైయస్ జగన్ ప్రభుత్వంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు లేదా జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షం టీడీపీ విమర్శలు సంధించినప్పుడు.. నేనున్నా.. నేనున్నా అంటూ మీడియా ముందుకు వచ్చి..ప్రెస్ మీట్ పెట్టే ఏకైక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ప్రభుత్వంలో పేరుకే సలహదారుడిగా ఉన్నా ఆయన.. ప్రభుత్వంలో ఏ శాఖ మంత్రి మాట్లాడకుండా.. వారి మాటలను కూడా ఆయనే జగన్ పలుకు.. జగనన్న పలుకు అన్నట్లు మాట్లాడేస్తారు. దీంతో ఆయనకు సకల శాఖల మంత్రి అనే ట్యాగ్‌ను ప్రతిపక్షం తగిలించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల సజ్జల వారు ప్రెస్‌మీట్‌లు పెడుతూ.. మీడియా ముందుకు వచ్చి సౌండ్ చేయడం లేదనే ఓ టాక్ అయితే అమరావతిలో తెగ హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సజ్జల వారి సైలెంట్‌ వెనుక ఉన్న కారణాలపై భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. 

ఇటీవల సీఎం వైయస్ జగన్.. తన కేబినెట్‌ను వునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ క్రమంలో కేబినెట్‌లో ఒకరు ఇద్దరు తప్పా.. మిగిలిన వారంతా కొత్తవారు వస్తారనే ఓ టాక్ అయితే నడుస్తోంది. దీంతో కొత్త మంత్రుల బాధ్యతను సీఎం జగన్.. తన రాజకీయ వ్యవహారాల సలహాదారు.. శ్రీ శ్రీ శ్రీ సజ్జల వారి భుజస్కంధాలపై పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మంత్రులు అయిన వారు కాకుండా.. మిగతా ఎమ్మెల్యేల పనితీరు.. వారికి నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్న గుడ్ విల్‌తోపాటు వారి ప్లస్‌లు.. మైనస్‌లపై నివేదికలు తెప్పించుకోవడంతో పాటు  క్యాస్ట్ ఈక్వేషన్స్‌ చూసి వాటి ఆధారంగా వారి ఎంపిక ప్రక్రియను ఈ సజ్జల వారు చేపట్టనున్నట్లు సమాచారం. 

అదీకాక రానున్నదీ ఎన్నికల సీజన్.. ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకమయ్యే వారికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని.. సీఎం జగన్ నుంచి ఇప్పటికే సజ్జల వారికి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఆయన జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కొత్త కేబినెట్ కొలువు తీరే వరకే కాకుండా.. . మాజీలు అయిన పాత మంత్రులకు.. జిల్లాల వారిగా కొత్త బాధ్యతలు అప్పగించే వరకు ఈ సజ్జల వారు సైలెంట్‌గా ఉంటారనే ఓ టాక్ అయితే తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా మస్త్ మస్త్‌గా నడుస్తోంది. 

అలాగే రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్థానాలు.. వైయస్ఆర్సీపీ ఖాతాలోకే వెళ్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి ఎంపిక బాధ్యత కూడా సీఎం జగన్.. సజ్జల మీద పెట్టినట్లు తెలుస్తోంది. దానిపై ఇప్పటికే సజ్జల చాలా కసరత్తు చేసి.. నాలుగురి పేర్లు ఖరారు చేయగా.. అందులో ముగ్గురి పేర్లు.. జగన్ ఖరారు చేశారని సమాచారం. మరొకరి పేరుపై జగన్ సందిగ్ధనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఒక్కరిని కూడా ఏప్రిల్ నెలాఖరులోగా సీఎం జగన్ ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. 

మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు 2024 కంటే మందే ఉండే సూచనలు ఉన్నాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరీ అవసరమైతే తప్పా.. అప్పటి వరకు ఈ సజ్జల వారు సైలెంట్‌ని వీడేలా లేరని ఓ చర్చ అదే తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా వైరల్ అవుతోంది.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.