ఆ పబ్‌లో రేవంత్‌రెడ్డి మేనల్లుడు!.. బీజేపీ నేత కుమారుడు!?
Publish Date:Apr 4, 2022
Advertisement
ఫుడింగ్ అండ్ మింక్. పబ్.. డ్రగ్స్.. టాస్క్‌ఫోర్స్ రైడ్‌తో సంచలనంగా మారింది. ఆ పబ్‌లో ప్రముఖుల పిల్లలు ఉండటంతో డ్రగ్స్ ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. డ్రగ్స్‌పై పోరుబాట పడతామని కాంగ్రెస్ నేతలు చెబుతుంటే.. డ్రగ్స్ దందా వెనుకున్న టీఆర్ఎస్ పెద్దల జాబితా బయటపెడతామంటూ బీజేపీ సవాల్ చేసింది. విపక్షాల ఆరోపణలకు కౌంటర్‌గా టీఆర్ఎస్ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ ఘటనలో ఉన్నదంతా రెండు జాతీయ పార్టీల నేతల పిల్లలే అంటూ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. పబ్‌పై పోలీసుల రైడ్‌లో దొరికిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మేనల్లుడు కూడా ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ పబ్ నిర్వాహకుడు అభిషేక్.. బీజేపీ నాయకురాలు ఉప్పాల శారద కుమారుడని తెలిపారు. ఇంకా పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతల పిల్లలు ఆ పబ్‌లో ఉన్నట్టు తెలుస్తోందని బాల్క సుమన్ ఆరోపించారు. భవిష్యత్‌లో మరిన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తాయంటూ మరో బాంబు పేల్చారు. మేనల్లుడే ఉండటంతో.. పీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎవరికి నీతులు చెప్తారో చెప్పాలంటూ బాల్క సుమన్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎవరిని బొంద పెడుతాడో చెప్పాలని నిలదీశారు. హైదరాబాద్‌లో పేకాట క్లబ్‌లు గతంలో ఉండేవని.. అవన్నీ కాంగ్రేస్ నేతలవేనని అన్నారు. ఇప్పుడు డ్రగ్స్ కేసుల్లో దొరికింది కూడా కాంగ్రెస్, బీజేపీ నేతల పిల్లలేనని అన్నారు.
http://www.teluguone.com/news/content/bjp-and-congress-leaders-kids-in-pubs-39-133906.html





