పురంధేశ్వరితో స్నేహమంటునే టిఎస్ఆర్ పేచీ
Publish Date:Jan 11, 2012
Advertisement
విశాఖపట్నం: కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరితో తనకు ఏ విధమైన విభేదాలు లేవని, స్నేహసంబంధాలున్నాయని అంటూనే కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి విశాఖపట్నం లోకసభ స్థానం విషయంలో కొలికి పెడుతున్నారు. పురంధేశ్వరితో తమ మధ్య తగువు లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అయితే, విశాఖపట్నం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని, పురంధేశ్వరి మరో నియోజకవర్గాన్ని చూసుకోవాలని గతంలో అన్నారు. దానిపై పురంధేశ్వరి తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను నియోజకవర్గం మారే ప్రసక్తి లేదని ఆమె కచ్చితంగానే చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన పురంధేశ్వరికి అప్పట్లో కాంగ్రెసు అధిష్టానం విశాఖపట్నం సీటు ఇచ్చింది. అక్కడి నుంచి ఆమె విజయం సాధించారు. ఇప్పుడు ఆ సీటుపై టి.సుబ్బిరామిరెడ్డి పేచీ పెడుతున్నారు.
http://www.teluguone.com/news/content/kendra-minister-24-10848.html





