కేజ్రీవాల్ ని రనవుట్ చేసే పనిలో సిద్దూ!
Publish Date:Sep 3, 2016
Advertisement
సిద్దూ అద్భుతమైన బ్యాట్సమన్ అయినా పెద్దగా పాలిటిక్స్ తెలిసిన వ్యక్తి కాదు. అందుకే, చాలా రోజులు ఇండియా కోసం ఆడినా క్యాప్టెన్ అవ్వలేకపోయాడు. రిటైర్మెంట్ అయ్యాక బీజేపిలో చేరి ఒకింత సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఆ పార్టీ సిద్దూకి తగినంత గుర్తింపు ఇచ్చింది. ఎంపీగా పోటీ చేయించింది. రాజ్యసభ సీటు కూడా ఇచ్చింది. అయినా ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా రాజకీయం నిజంగా ఒంటబట్టని సిద్దూ ఎందుకోగాని ఈ సారి మొత్తం అతలాకుతలం చేసుకున్నాడు! పార్టీ మీద అలిగో, లేదంటే ఇతర పార్టీల్లోంచి వస్తున్న టెంప్టింగ్ ఆఫర్ల వల్లో నవజ్యోత్ సింగ్ సిద్దూ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఎవ్వరూ చేయని సాహసం చేసి బంగారం లాంటి రాజ్యసభ సీటు వదులుకున్నాడు. రాజీనామా చేసి కొన్ని రోజులుగా ఖాళీగా కూర్చున్నాడు! అందరూ అనుకున్నట్టు ఆప్ లో చేరిపోలేదు... సిద్దూ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా చక్రం తిప్పేందుకే బీజేపి ఇచ్చిన రాజ్యసభ సీటు వద్దనుకున్నాడని అంతా భావించారు. ఆయన వెళ్లి కేజ్రీవాల్ ని కలిసి ఆ అంచనాల్ని నిజం కూడా చేశాడు. కాని, ఏమైందో ఏమోగాని ఆప్ క్రీజులోకి సిద్దూ వెళ్లలేదు. పెవెలియన్ లోనే వుండిపోయి ... హఠాత్తుగా స్వంత పార్టీ ప్రకటన చేశాడు! పంజాబ్ లోని మరికొంత మంది చిన్నా, చితకా నేతలతో కలిసి ఆయన ఆవాజ్ ఏ పంజాబ్ అనే ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు తాజాగా ప్రకటించాడు! ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. పైగా ఈ ఫ్రంట్ పెట్టటం ద్వారా ఇటు ఆకాళీదల్, బీజేపి కూటమిని, అటు కాంగ్రెస్ ను, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీని సిద్దు ఎదుర్కొని ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది! అంత పోటీలో ఈ ఆవాజ్ ఏ పంజాబ్ ఊడబొడిచేదేం లేదంటున్నారు క్రిటిక్స్! అయినా సిద్దూ ఇలాంటి సాహసం చేయటానికి కారణం ఏంటి? కొందరి టాక్ ప్రకారం... నవజ్యోత్ సింగ్ సిద్దూ బీజేపిలో అసంతృప్తిగా వుండటం చూసి కేజ్రీవాల్ వల వేశాడట! ఆయన తన పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని అనటంతో సిద్దూ బీజేపి టీమ్ లోంచి ఆప్ టీమ్ లోకి జంప్ అవుదామనుకున్నాడు. కాని, తీరా రాజ్యసభ సీటు కూడా వదిలేసి వచ్చాక అరవింద్ కేజ్రీవాల్ తన కేడీ వేషాలు మొదలు పెట్టాడట! సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చేంత లేదని స్పష్టమైపోయింది. దాంతో సిద్దూకి తిక్కరేగిపోయింది... అటు బీజేపికి, ఇటు ఆప్ కి కాక సతమతం అవుతోన్న సిద్దూపై కాంగ్రెస్ కూడా ఓ కర్చీఫ్ వేసింది. కాని, పంజాబ్ లో ప్రస్తుతం ప్రతి పక్షం అయిన కాంగ్రెస్ కి గెలిచేటంత సీన్ లేదని డౌట్స్ వున్నాయి. కాబట్టి కాంగ్రెస్ లో కాలేయకుండా ఆప్ దిమ్మతిరిగిపోయేలా సిద్దూ స్వంత ఫ్రంట్ ఆలోచన చేశాడంటున్నారు! ఆవాజ్ ఏ పంజాబ్ ని కూడా షార్ట్ గా పిలిస్తే ఆప్ అనే అనాల్సి వస్తుంది. పైగా పంజాబ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో బీజేపి, అకాళీదల్ కూటమికి డ్యామేజ్ చేయాలని చూస్తోంది ఆప్. ఇలాంటి సమయంలో సిద్దూ తన దుకాణం ఒకటి కొత్తగా తెరవటంతో ప్రతి పక్షాలన్నిటి మధ్యా ఓట్లు చీలి అధికార కూటమికి లాభం చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి! చూడాలి మరి.... పంజాబ్ ఎన్నికల మ్యాచ్ లో సిద్దూ బ్యాటింగ్ ఎలా వుంటుందో! రన్స్ కొట్టి బీజేపిని గెలిపిస్తాడో...బాల్స్ వేస్ట్ చేసి ఆప్ నో, కాంగ్రెస్ నో గెలిపిస్తాడో! ఏది ఏమైనా సిద్దు కలలు కన్నట్టు పంజాబ్ సీఎం ఆయనే అయ్యే అవకాశాలు మాత్రం పెద్దగా లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు!
సవజ్యోత్ సింగ్ సిద్దూ... ఈ పేరు ఇండియన్ క్రికెట్లో ఎంత పాప్యులరో అంతే వివాదాస్పదం కూడా! అసలు ఆయన ఎలా ఆడేవాడో ఈ కాలం క్రికెట్ లవ్వర్స్ కి పెద్దగా తెలియదు! కాని, విచిత్రం ఏంటంటే, ఆయన క్రికెట్ ఎలా ఆడేవాడో తెలియకపోవటమే కాదు పాలిటిక్స్ ఎలా ఆడతాడో కూడా జనానికి అర్థం కావటం లేదు ప్రస్తుతం! ఎవరికి మేలు చేసి ఎవరికి కీడు చేస్తాడో, ఎవరి కొంప కొల్లేరవుతుందో అస్సలు తెలియటం లేదు...
http://www.teluguone.com/news/content/kejriwal-sidhu-45-66013.html





