కేసీఆర్ తప్పటడుగులు..టీఆర్ఎస్ లో అంతర్మథనం !

Publish Date:Jul 6, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, దటీజ్ కేసీఆర్, మహా మేథావి. చాలా తెలివైన రాజకీయ నాయకుడు. అంతకంటే గొప్ప రాజకీయ వ్యూహకర్త. ఎంతటి రాజకీయ ఉద్దండులనైనా ఆయన ఇట్టే బుట్టలో వేసుకోగలరు. అంతేకాదు, ఎంతటివారినైనా అంతే తేలిగ్గా తీసి కరివేపాకులో కలిపేయనూ గలరు. ఇన్నెందుకు ఆయన ఘటనా ఘటన సమర్ధుడు. ఆయన రాజకీయ, విజ్ఞత, వివేచన మీద ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర లేదు. 
ఆయన ఎప్పుడు, ఎందుకు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనతో సహా ఎవరికీ తెలియదు, కానీ, ఆయన నోటి నంచి వచ్చిన మాట రాజకీయ తుపాను సృష్టిస్తుంది. అలాగే, రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు సమ ఉజ్జీగా నిలిచే నాయకుడు మరొకరు లేరు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కంటే సీనియర్ నాయకులు ఉన్నా, ఉద్యమ నేతగా జనం ఆయన్ని ఎత్తు కుర్చీ ఎక్కించారు. సో.. ఆయనే టాలెస్ట్ లీడర్’గా చలామణి అవుతున్నారు. కానీ, అన్ని రోజులలో ఒకలా ఉండవు.నిజమే.నిన్నమొన్నటిదాకా, ఆయన తిరుగలేని నాయకుడే, అందులో  అనుమానం లేదు, అతిశయోక్తి అసలే లేదు. ఒక సంవత్సరం  క్రితం వరకు కేసీఆర్ గురించి చాలా మందికి ఉన్న అభిప్రాయం ఇదే. స్వపక్షీయులే కాదు, ప్రత్యర్ధులు కూడా అదే అనుకున్నారు. ఆయనను ఢీ’ కొనడం అయ్యే పని కాదనే నిర్ణయానికి వచ్చారు.అయితే అది నిన్నటి మాట.ఈరోజు పరిస్థితి అది కాదు. ఒక విధంగా ప్రస్తుతం అయన పరిస్థితి ఇంటా బయట ఒకేలా ఉందని అంటున్నారు. అంతేకాదు, ఆయనకు అడుగడుగునా అవరోధాలు, అవమానలే ఎదురవు తున్నాయని వాళ్ళు వీళ్ళు కాదు తెరాస నాయకులే అంటున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు. 

అవును. ఒక్క తప్పటడుగు, ఒకే ఒక్క తప్పటడుగు, అయన వ్యక్తిగత ఇమేజ్’నే కాదు, పార్టీ ఇమేజ్’ని ప్రభుత్వం ఇమేజ్’ని చివరకు రాష్ట్ర ఇమేజ్’ని కూడా డ్యామేజి చేసింది. ఒక తప్పు చేస్తే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు వెంట తప్పు, తప్పు మీద తప్పు చేయక తప్పని అనివార్య పరిస్థితిని ఎదుర్కొనక తప్పుదు. కేసీఆర్ విషయంలో అదే జరిగింది. అదే జరుగుతోందని అంటున్నారు.  

నిజానికి, తెరాస పతనానికి 2014 లోనే తొలి బీజం  పడింది. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే కేసీఆర్, చాలా స్పష్టమైన విధాన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి.... తెరాస ఇక ఎంత మాత్రం ఉద్యమ పార్టీ కాదని ప్రకటించారు.అంటే తెరాస జీవనాడిని చిదిమేశారు.  అయన తమ తప్పు లేకుండా ఇంకో చక్కని మాట కూడా సెలవిచ్చారు. ఇక పై తెరాస ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని, ఎలాంటి అనుమానాలకు ఆస్కారంలేని విధంగా ‘క్లియర్ కట్’గా కుండ బద్దలు కొట్టారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగిందనేది, చరిత్ర. రాజకీయ పునరేకీకరణ పేరిట, ఒక్క బీజేపీ మినహా మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలను ఎగరేసుకు పోయారు. దీంతో, రాష్ట్రంలో ఇక తెరాసకు తిరుగేలేదనే అభిప్రాయం బలపcrపోయింది.  ఎనిమిదేళ్ళలో పదహారణాల రాజకీయ పార్టీ, ఇంచక్కా ఫోర్ ప్లస్ వన్ ఫ్యామిలీ పార్టీగా మారిపోయింది.

ఇక ఆ తర్వాత సహజంగానే కుటుంబ పార్టీలకు అనివార్యంగా ఉండే, కుటుంబ, వారసత్వ కలహాలు, అవినీతి ఇత్యాదులన్నీ వచ్చి చేరాయి. అయినా, తెలంగాణ ప్రజలు 2018లో తెరాసకు మరో అవకాశం ఇచ్చారు. చంద్రబాబును బూచిగా చూపించి సెంటిమెంట్’ను రెచ్చగొట్టి ఆ ఎన్నికలలో విజయం సాధించారు. 

అదొక అధ్యాయం అనుకుంటే, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలోనే తెరాస గెలిచినా గడచిన మూడున్నర నాలుగు సంవత్సరాలలో ఇటు పార్టీ పైన అటు ప్రభుత్వం పైనా ఆయన పట్టు తప్పింది. ఇందుకు ప్రధానంగా కుటుంబ, వారసత్వ వివాదాలే కారణంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ‘కేటీఆర్’ను తక్షణం ముఖ్యమంత్రిని చేయాలనే వత్తిడి పెరుగుతోందని, అందుకే ముఖ్యమంత్రి తీవ్ర వత్తిడికి గురవుతున్నారాణి, కల్వకుట్ల ఫ్యామిలీ క్లోజ్ సర్కిల్స్ మీడియా సాక్షిగా బయట పెడుతున్నారు.ఈ వత్తిడి నేపధ్యంగానే ముఖ్యమంత్రి అనూహ్యంగా తప్పదు నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు.  

అలాగే, 2014లో ఉద్యమ పార్టీ కాదని  ప్రకటించడం వ్యూహాత్మక తప్పిదం అయితే, ఇప్పడు అందుకు కొనసాగింపుగా కుటుంబ పాలనను ఎస్టాబ్లిష్ చేసేందుకు, ఈటల రాజేదంర్’ పై వేటు వేయడంతో మొదలైన తప్పటడుగులు,ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేళ విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో జెండా ఎగురేసేందుకు ప్రయత్నిస్తూ విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
నేటి బాలలే రేపటి పౌరులు.. ప్రధాని మోడీ ఆ రేపటి పౌరులతో మమేకమై వారిని ఉత్సాహ పరుస్తూ వారి మధ్య కలియదిరిగారు. వారు నృత్యం చేస్తుంటే చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. ఈ దృశ్యం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద కనిపించింది.
దేశాన్ని అవినీతి, వారసత్వం చెదపురుగుల్లా తొలిచేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగించారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయడం ప్రధానిగా మోడీకి ఇది తొమ్మదో సారి.
రెండు స్థంభాల‌కు తాడు గ‌ట్టి ఓ పిల్ల క‌ర్ర ఆదారంతో ఆ తాడు మీద న‌డు స్తూ ఒక వేపు నుంచి మ‌రో వేపు న‌డుస్తుంది, గొప్ప ఫీట్. గాల్లో పుల్ల‌ప్స్ చేసే వాడిని చూస్తే ఏకంగా గుండె ఆగిపోతుందేమో!
 విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మా ణానికి కృషి చేశామని,  మనం చేసిన కృషి కారణంగా ఐటి రంగం అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు  అదే వెన్నెముకగా మారిందన్నారు.  
కేంద్రం తీరు వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర అస‌మ‌ర్ధ నిర్వాకం వ‌ల్ల‌నే దేశ ఆర్ధిక వ్య‌వస్థ కుంటుప‌డింద‌ని కేసీఆర్ విమ‌ర్శించారు
పరిపాలనా వికేంద్రీకరణలో మరో అధ్యాయం జిల్లా ల పెంపు అని తెలి పారు. రైతులకు అండగా వైఎస్సార్‌ రైతు భరోసా తీసుకొచ్చామన్నారు. 52 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నా మని జగన్‌ వెల్లడించారు.
స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత్ స్వతంత్రంగా మనుగడ సాగించలేదని, ముక్కలు చెక్కలు అవుతుందన్న‌ వారి అభిప్రాయం తప్పని నిరూపించామన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి దన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన బలమని ప్రధాని మోదీ అన్నారు
తిరుమలకు భక్తులు పోటెత్తారు. టీటీడీ భక్తుల రద్దీని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో తిరుమల కొండపై భక్తులు నానా ఇక్కట్లూ పడుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోందని టీటీడీ చెబుతున్నప్పటికీ భక్తులు మాత్రం ఇంకా ఎక్కువ సమయమే పడుతోందని చెబుతున్నారు.
భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న శుభవేళ వినూత్న రీతితో ఓ వ్యోమగామి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈజిప్టులోని ఓ చర్చిలో ఆదివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 41 మంది మరణించారు. చర్చిలో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ కనీసం ఐదు వేల మంది ఉన్నారని చెబుతున్నారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై మళ్లీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ విదేశాంగ విధానం బ్రహ్మాండమంటూ కితాబిచ్చారు. లాహో్ లో ఆదివారం (ఆగస్టు 14)లాహోర్‌లో ఈ రోజు (ఆదివారం) నిర్వహించిన సభలో ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా ఒత్తిళ్లను లెక్క చేయకుండా, భారత్‌ తక్కువ ధరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ సమర్థించారు. ఇండియా, పాకిస్థాన్‌లకు ఒకే రోజు స్వాతంత్య్రం లభించినా, న్యూఢిల్లి మాత్రం దేశ ప్రజల అవసరాలకు తగినట్లు విదేశాంగ విధానానికి కట్టుబడి ఉందని, కానీ, పాకిస్థాన్‌లోని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఇమ్రాన్‌ఖాన్‌ విమర్శలు గుప్పించారు.
ఉన్న అవకాశాలను కూడా చేజార్చుకోవడం కాంగ్రెస్ కు అలవాటే. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ కు నిజంగా మునుగోడు ఉన ఎన్నిక కలిసి వచ్చిన అవకాశమనే చెప్పాలి. అయితే అంతర్గత విభేదాలతో ఆ అవకాశాన్ని చేజార్చుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందా అంటే ఔననే చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నిక వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ కే కీలకం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.