నీకిది.. నాకిది అన్న ఒప్పందం.. సంబంధం కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో తమకు ఉందని వైసీపీ ఎంపీ ఒకరు కుండ బద్దలు కొట్టేశారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గత మూడేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీసీ మద్దతు ఇస్తున్నదని అంగీకరించారు. అందుకు ప్రతిగా కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పేశారు. దీంతో ఇప్పటి దాకా గుట్టుగా ఉన్న బీజేపీ- వైసీపీ క్విడ్ ప్రోకో సంబంధం లేదా అనుబంధం ఇప్పుడు బట్టబయలైపోయింది. కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మాకు మీరు మద్దతు ఇవ్వండి మీకు మేం సహరకిస్తాం అంటూ బీజేపీ- వైసీపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని గత మూడేళ్లుగా విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని బీజేపీ, వైపీపీలు రెండూ రాజకీయ డ్రామాలతో రక్తి కట్టిస్తూ వచ్చాయి. తలుపు చెక్కతో నువ్వొకటను.. తమలపాకుతో నేను రెండంటా అన్న చందంలో రాష్ట్రంలో బీజేపీ, వైసీపీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. కానీ సాలూరు ఎంపీ వ్యాఖ్యలతో ఆ పార్టీల రహస్య మైత్రి ఇప్పుడు బట్టబయలైపోయింది.
కేంద్రంలోని మోడీ సర్కార్ కు జగన్ ప్రభుత్వం అన్ని అంశాలలోనూ మద్దతుగా నిలవడంలో రహస్యం ఏమీ లేదని కోటగిరి శ్రీధర్ వస్పష్టంగా చెప్పేశారు. గత మూడేళ్లుగా తమ ప్రభుత్వం అన్ని అంశాలలోనూ మోడీ సర్కార్ కు మద్దతు ఇస్తూనే ఉందని పలు సందర్భాలలో ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించామనీ ఆయన అన్నారు. ఆ కారణంగానే కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అదిస్తోందని చెప్పారు.
ఇంత కాలంగా అవే ఆరోపణలు చేస్తున్న విపక్షాలకు కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చడమే కాకుండా.. జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణను తప్పించుకోవడానికే కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారనీ, రాష్ట్రానికి మొండి చేయి చూపినా పన్నెత్తు మాట కూడా అనడం లేదనీ మరింత పదునైన విమర్శలు సంధించేందుకు అవసరమైన ముడి సరుకుని కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యలు విపక్షాలకు అందించాయి.
ఇక్కడితో ఆగకుండా కోటగిరి శ్రీధర్ 2024 ఎన్నికలకు బీజేపీ, వైసీపీల వ్యూహాన్ని కూడా వెల్లడించేశారు. 2024 ఎన్నికలలో వైసీపీ విజయానికి సహకరిస్తే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ భాగస్వామి కూడా అవుతుందని కోటగిరి చెప్పారు. ఏపీకి కేంద్రం నిధుల విషయంలో ఉదారంగా సహకారం అందించడానికి జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాలలోనూ మద్దతుగా నిలవడమే కారణమని అన్నారు. 2024 ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా సాధిస్తామని కోటగిరి విశ్వాసం వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yes-quid-pro-co-with-bjp-is-true-saya-ycp-mp-39-139157.html
బీజేపీకి జనసేనానిని కటీఫ్ చెప్పేశారా? ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తనకు బీజేపీతో మైత్రి పెద్ద ప్రతిబంధకంగా మారుతోందని భావిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కు అరుదైన గౌరవం లభించనుంది. అమెరికాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా రూపొందించిన 19 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. భారత్ అవతల ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ అతి పెద్ద విగ్రహం ఇదే కానుంది.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఏపీ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. మంత్రి రోజాపై, ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తిపై కేసు నమోదు చేశారు.
ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కూటమి విజయం పక్కా అని ఆత్మసాక్షి సర్వే నిర్ద్వంద్వంగా తేల్చేసింది శ్రీ ఆత్మసాక్షి సర్వే. చంద్రబాబు అరెస్టు తరువాత ఈ సెప్టెంబర్ 30 వరకూ నిర్వహించిన ఈ సర్వేలో తెలుగుదేశం, జనసేన పొత్తు వచ్చే ఎన్నికలలో ప్రభంజనం లాంటి విజయాన్ని అందిస్తుందనీ, అదే ఈ కూటమి బీజేపీని కూడా కలుపుకుంటే మాత్రం బొక్క బోర్లా పడుతుందనీ తేల్చింది.
తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ , కాంగ్రెస్, బిజెపిలు దూకుడు పెంచాయి. అందరికంటే ముందే 115 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించిన బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ రేపో మాపో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల సమరశంఖం పూరించింది.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి క్వాష్ పిటిషన్ విచారణ సుప్రీం కోర్టులో కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించిన సంగతి విదితమే.
జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అంగళ్లు కేసులో తెలుగుదేశం నేతలకు బెయిలు మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్దమైంది తాజాగా, తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆయా స్థానాల జాబితా విడుదల చేసింది. అభ్యర్థులను కూడా త్వరలో వెల్లడించనుంది.
ఏపీలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదు. సమన్యాయం అన్న పదానికే అర్ధం కనిపించడం లేదు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘిస్తున్నదన్న విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి. నోటిఫికేషన్ సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి వార్త చెప్పింది. వేతన సవరణ కమిటీ (పీఆర్‌సీ)ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్‌సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్‌ను, సభ్యుడిగా బి.రామయ్యను నియమించింది. ఆరు నెలల్లోగా వేతన సవరణపై నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి సూచించింది. పాత పీఆర్‌సీ అమలు గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది. జులై ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంది. శిశశంకర్ కమిటీ సిఫారసు మేరకు కొత్త పీఆర్సీ ప్రకటించనుంది. అప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనంలో 5 శాతం మధ్యంతర భృతిని ప్రభుత్వం ప్రకటించింది.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కాం జరిగిందంటూ ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తూ.. ఆ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంవద్రబాబునాయుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికలు హోరాహోరీ జరుగుతే జయాపజయాలను నిర్ణయించేది తటస్థుల ఓట్లే అని అంటారు. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే, ఇండియా (కొన్ని మీడియా సంస్థలు ఇఎన్డిఐ అలయెన్స్ అంటున్నాయి) కూటముల మధ్య హోరా హోరీ పోరు తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో తన అరెస్ట్ అక్రమమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై మంగళవారం (సెప్టెంబర్3) విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుథ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ముందు ఈ కేసు విచారణకు రానుంది.