ఓ తెలంగాణా ఓ కేసీఆర్‌ కథ

Publish Date:Jul 12, 2012

Advertisement

ఇదేమిటీ? ఓ తెలంగాణా...ఓ కేసీఆర్‌ కథ అంటారు అనుకుంటే పొరబాటే. ఈ కేసీఆర్‌ ఎవరో కాదు టిఆర్‌ఎస్‌ అథినేత. ఈయన తెలుగుదేశం పార్టీని వదిలి తెలంగాణా రాష్ట్రసమితి పార్టీ అథినేతగా మారినప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణా పాటనే పాడుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు తుమ్మినా, దగ్గినా కూడా అది తెలంగాణా ఇచ్చేసేందుకే అని ఈయన సంబరపడుతుంటారు. దేనికోసమైతే తాము పార్టీ పెట్టారో ఆ లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందన్న ఆశావాదం ఆయనికి గ్లూకోజు అందుకే సుగర్‌ వచ్చినా లెక్కచేయరు. ఎప్పుడు తెలంగాణా వస్తుందా అని భార్య భర్త కోసం గుమ్మంలో ఎదురుచూసినట్లే కేసీఆర్‌ కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అందని ద్రాక్షపండు పుల్లన అన్నట్లు ఆయన తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సమైక్యవాదులంటే కారాలు, మిరియాలు నూరేందుకు పార్టీలో ఒక పదవి ఇచ్చి మరీ హరీశ్‌రావును ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్‌ మాట హరీశ్‌రావు నొటెంట అని అందరూ అనుకుంటూ ఉంటారు. తెలంగాణా గురించి ఎవరూ అనుకోనప్పుడే మూడు నెలల్లో వచ్చేస్తుందని ఒకసారి, ఆరు నెలల్లో వచ్చేస్తుందని మరోసారి జోస్యాలు చెబుతూ కాలం గడిపేస్తుంటారు.

 

 

ఇదే తెలంగాణా పేరు చెప్పి తమ నేతలతో చేయించిన రాజీనామాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం కాదు కానీ ఉప ఎన్నికలు మాత్రం వస్తుంటాయి. అలాంటి ఉప ఎన్నికల్లో ఒకసారి బిజెపి చేతిలో ఒక అసెంబ్లీ స్థానాన్ని నష్టపోయారు కూడా. ఈయన హయాంలోనే ఇటీవల 2012 ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం తెలంగాణాలోని ఒక్క పరకాల అసెంబ్లీలో జరిగిన ఈ ఎన్నికల్లో కేవలం 1500ఓట్ల మెజార్టీతో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి భిక్షపతిని గెలిపించుకోవటానికి మొత్తం టిఆర్‌ఎస్‌ అంతా చెమటలు కక్కేసింది. ఒకదశలో ఓడిపోతామన్న బాధ, భయం టిఆర్‌ఎస్‌కు ఏర్పడిరది. కేసీఆర్‌ది ఐరన్‌ టంగ్‌ అన్నట్లు సునాయసంగా తెలంగాణావాదంపై గెలవాల్సిన ఈయన  పార్టీకి చావుతప్పి కన్నులొట్టపోయింది. ఏ సమైక్యవాద పార్టీ వల్ల తెలంగాణా రాదని ప్రచారం చేసి ఓటెయ్యవద్దని ప్రజలను హెచ్చరించారో ఆ వైఎస్‌ఆర్‌ కాంగ్రేస్‌ పార్టీ అభ్యర్థి కొండాసురేఖ టిఆర్‌ఎస్‌ నేతలకు ముచ్చెమటలు పోయించారు.


ఆ చెమటలను తుడిచేసుకుని తెలంగాణావాదం గెలిచిందని హరీశరావు చేత ప్రచారం చేయించారు. ఇంకో విశేషమేమిటంటే ఈయన ఇంకేముంది తెలంగాణా వచ్చేసిందని అంటారో అప్పుడు అది ఖచ్చితంగా రాదు. ఈ ఇష్యూని పక్కకు తప్పించి వేరే సమస్యను ముందుకు  తీసుకురావటానికి కాంగ్రెస్‌ పార్టీ అలవాటు పడడింది. అందుకే ఇంకేముంది తెలంగాణా వచ్చేస్తుందని రాజీనామాలు చేసేయమంటే ఎన్నికలే వస్తున్నాయని కేసీఆర్‌ను సొంత పార్టీ ప్రతినిధులే విమర్శిస్తున్నారు. తాజాగా రెండు రోజుల నుంచి తెలంగాణా వచ్చేసిందని కేసీఆర్‌ చంకలు గుద్దుకోవటం చూసి మరేమవుతుందో అని టిఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కేసీఆర్‌ ఉత్సాహపడితే తెలంగాణా వస్తుందా? కేంద్రంలోని అందరూ తెలంగాణా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి కదా! ఏమైనా  నిరంతరం కొనసాగే ఈ కథకు టైటిల్‌ సరిపోయిందనుకుంటా. కథ కూడా ఇంకా సాగుతూనే ఉంది.

By
en-us Political News

  
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
తాజాగా వెలువడిన ఆర్థిక ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో సంస్థ భారీ మొత్తంలో లోటును చవిచూడాల్సి వచ్చింది. ప్రయాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే, రోజువారీ నిర్వహణ, ఫైనాన్స్ ఖర్చులే అధికంగా ఉండటంతో  లోటు 405 కోట్ల రూపాయలు దాటేసింది. 
తీరొక్క పూలతో కళకళలాడుతున్న మార్కెట్లు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.