ప్రధానిపై విమర్శల వర్షం.. ప్రశ్నల శర పరంపర..స్వరం పెంచిన కేసీఆర్

Publish Date:Jul 2, 2022

Advertisement

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ గడ్డపై బస చేసి ఉన్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వరం పెంచారు. మోడీ లక్ష్యంగా విమర్శల దాడికి పదును పెట్టారు. ఒక వైపు హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ కేసీఆర్ వ్యూహాత్మకంగా రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ ఆహ్వానించి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జల విహార్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు.  ఆ మావేశం వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో ప్రసంగించడానికి ఒక రోజు ముందే కేసీఆర్ తనదైన శైలిలో మోడీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు.

ఒక రకంగా మోడీకి  ఆయన ఆదివారం (రేపటి) ప్రసంగం ఎజెండా ఏమిటన్నది కేసీఆర్ ఇచ్చేశారు. తన విమర్శలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని మోడీకి కల్పించారని చెప్పవచ్చు. దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. తన ప్రసంగం మొత్తం యశ్వంత్ కు మద్దతు ప్రకటనకు కాకుండా మోడీపై విమర్శల పరంపరకే ఉపయోగించుకున్నారు. తెలంగాణ గడ్డపై రెండు రోజులు బస చేయనున్న మోడీ ముందుగా తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు. అలాగే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అదికారంలో ఉన్నమోడీ సర్కార్ ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా అమలు చేసిందా చెప్పాలన్నారు. చెసినట్లైతే అవేమిటో వివరించాలన్నారు. ఈ ప్రశ్న తన ఒక్కడిదే కాదని యావత్ ప్రజానీకానిదనీ అన్నారు.

రైతులు అడుగుతున్నది మద్దతు ధర మాత్రమేననీ, బంగారం కాదనీ అన్న కేసీఆర్.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోడీ, అది చేయకపోగా వారి వ్యయాన్ని రెట్టింపు చేశారని అన్నారు. అన్యాయమైన రైతు చట్టాలు తీసుకువచ్చి రైతుల బతుకులను ఆగంఆగం చేశారని దుమ్మెత్తి పోశారు. చివరికి రైతుల ఆందోళనలకు దిగి వచ్చి వారికి బహిరంగ క్షమాపణ చెప్పి ఆ చట్టాలను ఉపసంహరించుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు మేం సాయం చేస్తే అవహేళన చేస్తున్నారన్నారు. కేంద్రం చేయాల్సిన పనిని మేం చేశామని, మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోన్నందుకు తాము గర్వ పడుతున్నామని, ఆ పని చేయలేకపోయినందుకు మోడీ సిగ్గుపడాలని కేసీఆర్ ఆన్నారు.

మోడీ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, అల్పాదాయ వర్గాల ప్రజలు ఇలా ఏ వర్గమూ సంతోషంగా లేదని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ వ్యవస్థను మోడీ దుర్వినియోగం చేశారని దుమ్మెత్తి పోశారు. మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుందన్నారు.

పెద్ద కంపెనీలన్నీ దేశం వదిలి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ అస్తవ్యస్థ పాలనను చూస్తూ టీఆర్ఎస్ మౌనంగా ఉండజాలదన్నారు. అలాగే ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో మోడీ ఏం మాట్లాడబోతున్నారో కేసీఆర్ చెప్పేశారు. మోడీ హైదరాబాద్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో తనను విమర్శించడం వినా మరో మాట ఉండదన్నారు. వ్యక్తిగతంగా మోడీతో తనకు విభేదాలు లేవన్న కేసీఆర్ మోడీ నిజాయితీగా తన ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణ గడ్డ వీడాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.