కే.సి.ఆర్‌ కోదండరామ్‌ మధ్య పెరిగిన అగాధం

Publish Date:Jul 14, 2012

Advertisement

ఎవడిగోల వాడిది అన్నంట్లుంది. కెసిఆర్‌ ప్రస్తుతానికి ప్రత్యేక తెలంగాణకుఉద్యమాలు అక్కర్లేదు తెలంగాణ వచ్చేందుకు ఏమంత సమయంలేదు అన్నారు. అంతటితో ఆగకుండా పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్‌ అధిష్టానం రాష్ట్రపతి ఎన్నికలు కాగానే తెలంగాణ ఎందుకు ఇవ్వనున్నారో కూడా సావధానంగా వివరిస్తూ  వైసిపి పార్టీ దూకుడుని తగ్గించడానికి కాంగ్రెస్‌కు తెలంగాణ ఇవ్వటం తప్ప మరో గత్యంతరం లేదని సెలవిస్తున్నారు. దీనిపై జాక్‌నేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఇంతవరకు అలాంటి సంకేతాలు ఏమీ అందలేదని, రాష్ట్రపతి ఎన్నికలముందే ఉద్యమాన్ని ముమ్మరం చేస్తే తెలంగాణ వచ్చితీరుతుంది అంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్యా అగాధం మరింత పెరినట్లుయింది.



నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపి మధుయాష్కీ ఇప్పట్లో తెలంగాణ ప్రకటించే సూచనేమీ తనవరకు రాలేదంటునన్నారు. టిజి వెంకటేశ్‌ ది మరోగోల ..మొదట రాయల్‌ తెలంగాణ రావాలన్నారు. అయితే  మాకేమీ రాయల్‌ తెలంగాణ అక్కర్లేదని తెలంగాణవాదులు తెగేసి చెప్పటంతో ఇప్పుడు మహారాయలసీమ అంటున్నారు. రాయలసీమలో నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు కలిపి మొత్తం ఆరు జిల్లాలతో మహారాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జెసి దివాకర్‌రెడ్డి మాత్రం రాయల్‌ తెలంగాణాకే కట్టుబడిఉన్నానన్నారు. కాంగ్రెస్‌ వాదులు, కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానమే చూసుకుంటుందని దాని నిర్ణయానికే కట్టుబడి ఉన్నామంటున్నారు. రాజ్యసభ సభ్యురాలైన రేణుకా చౌదరి కేంద్రం త్వరలో ఒక నిర్ణయానికి రానున్నారంటారు. ఆ నిర్ణయమేదో కూడా చెప్పరు. కావూరి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమే మంచిది నాన్చివేత ధోరణి కంటే అని అంటారు. కొందరు కాంగ్రెస్‌ నాయకులు  టిఆర్‌యస్‌ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తే తెలంగాణ ఇవ్వడం కష్టమేమీకాదంటున్నారు. ఆంద్ర జాక్‌  నేతలు భాషా రాష్ట్రంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం మనదే కాబట్టి ఎప్పటికీ కలసి ఉండాల్సిందే అంటారు.




తెలుగుదేశం తెలంగాణా నాయకులు తెలంగాణా మీద తేల్చకుంటే అక్కడ అడుగుపెట్టలేని పరిస్ధితిలో ఉన్నామని చంద్రబాబునాయుడ్ని త్వర పెడుతున్నారు. అయితే తెలుగుదేశంపార్టీలో ఉన్న కోస్తాంద్రలో సిట్టింగ్‌ ఎమ్మేల్యేలు జారిపోవటంతో దాన్ని చక్కపరచుకునే పనిలో  చంద్రబాబు ఉన్నారు. ఇక వైసిపి పార్టీ మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు. కేంద్రం ఇస్తామంటే మేము వద్దనం అంటూ చేతులు దులుపుకుంది. వైసిపి గౌరవ అద్యక్షురాలైన విజయమ్మకు జగన్‌కి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్ధాయిలో వినిపించి మద్దతు కూడ గట్టే పనిలో బిజీగా ఉన్నారు. కాని అస్తవస్త్యం అయిన జనజీవనాన్ని ఎవరూ పట్టించుకున్న ధాఖలాలు కనిపించడంలేదు.... ఎవరి ఉద్యమాలు, జెండాలు, ఎజెండాలు వారివే కాని సామాన్య ప్రజలకు తక్షణం కావల్సిన ధరలు అదుపులోకి తేవడం, విద్యాసంవత్సరం మొదలైనా పుస్తకాలు పంపిణీకాకపోవడం, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, రీఎంబర్స్‌ మెంట్లు, అంధకారం అలుముకున్న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిశ్రమలు కుదేలవ్వటంవల్ల సాటి కార్మికుల బ్రతుకులు, దుర్భరమవుతున్న సామాన్యుడి జీవనం ఎవరికీ పట్టడంలేదు. ప్రజలకు వారి సమస్యల కొరకు పాటుపడే నాయకుడికోసం భూతద్దం వేసి చూసినా ఒక్కరంటే ఒక్కరుకూడా కనబడటంలేదు.

By
en-us Political News

  
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.