రాజ్ భవన్ కు కేసీర్.. సయోధ్యకు శ్రీకారం?

Publish Date:Jun 27, 2022

Advertisement

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఈరోజు (మంగళవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.అయితే,గత కొంత కాలంగా, గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రి కేసేఆర్ మధ్య దూరం పెరిగిన నేఫ్యంలో, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుపై మొదట అనుమానాలు వ్యక్తమైనా, చివరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవణికి ముఖ్యమంత్రి కేసీఆర్ జహారవుతారని, ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు, ఉన్నతాధికారులు సైతం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. అయితే సంవత్సర కాలం పైగా, గవర్నర్ ను కలిసేందుకు ఇష్టపడని ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా, అనివార్యంగానే,రాజ్ భవన్ లో అడుగు పెడుతున్నారని, రాష్ట్ర హై కోర్టు కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, ప్రమాణ స్వీకార  కార్యక్రమానికి హాజరవుతున్నారని అంటున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉంటుంది, అందుకే ముఖ్యమంత్రి రాజ్ భవన్  వెళుతున్నారని, అధికార పార్టీ నాయకులు అంటున్నారు. 

అది చాలావరకు నిజమే అయినా,  ఇటీవల కొంత కాలంగా, గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య, మంచు కరుగుతోందని రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం తర్గుతోందని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో, ఇప్పడు ఇది ఆ దిశగా పడుతున్న తొలి అడుగు కావచ్చనే ఉహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గవర్నర్’తో విభేదాల కారణంగా, ముఖ్యమంత్రి మంత్రి వర్గ విస్తరణ వంటి కొన్ని కీలక నిర్ణయాలను చాల కాలంగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు, కొన్ని అనివార్య పరిస్థితులు ఏర్పడిన నేపధ్యంలో ముఖ్యమంత్రి ఒకడుగు ముదుకేసి గవర్నర్’తో సయోధ్య కోరుకుంటున్నారని అంటున్నారు. 

ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నేపధ్యంలో అయన స్థానంలో, అదే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్’ను మంత్రి వర్గంలోకీ తీసుకుంటారని అప్పట్లో గట్టి ప్రచారం జరిగింది. అందుకే ఆయన చేత ఎంపీ పదవికి రాజీనామా చేయింఛి, ఎమ్మెల్సీ చేశారని ప్రచారం జరిగింది. అప్పటినుంచి, మంత్రివర్గ విస్తరణ పై ఉహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే గవర్నర్’తో విభేదాలే కారణంగా మంత్రివర్గ విస్తరణ అప్పటి నుంచి వాయిదా పడుతోందని అయితే, ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి, ఎన్నికలకోసం మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ అంటే గవర్నర్’ అనుమతి తీసుకొనక తప్పుదు. అంతే కాదు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్నా, అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి. మరోవంక, మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా అయినా,  వెనకడుగు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

అందుకే ముఖ్యమంత్రి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు, ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక మాజీ కేంద్ర మంత్రితో పాటుగా, కరీంనగర్ జిల్లాకు చెందిన మరో కీలక నేత ఒకరు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. అందుకే, ముఖ్యమంత్రి ఆ దిశగా తొలి అడుగు  వేశారని, ప్రోటోకాల్ ఒట్టి సాకు మాత్రమే అంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని రాష్ట్ర పర్యటనల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రోటోకాల్ నిబంధనలను పాటించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సో.. ఈ సయోధ్యకు శ్రికరంగానే భావించవలసి ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.