వైసీపీ పాలనంతా పన్నుల వాత...పథకాల కోత.. చంద్రబాబు

Publish Date:Jun 28, 2022

Advertisement

జగన్ పాలన అంతా పన్నుల వాత, పథకాల కోత చందంగా సాగుతోంది. జగన్ సర్కార్ మూడేళ్ల పాలనలో ప్రజలపై ఒక వైపు పన్నులతో వాతలు పెడుతూ, మరో వైపు సంక్షేపథకాలకు కోతలు పెట్టడంగానే సాగిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు.

ప్రజలకు అందే సంక్షేమ పథకాలకు నిబంధనల చట్రాదలు బిగించి కోతలు పెట్టి వాటిలో కూడా డబ్బులు మిగుల్చు కోవడమే జగన్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తున్నదన్నారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో  ఆయన   చెత్త నుంచి ప్రతి దానిపై పన్నువిధిస్తూ ప్రజలకు ఆర్థిక వాతలు పెడుతోందని విమర్శించారు. అమ్మ ఒడిపథకంలో 52వేల మంది లబ్ధిదారులను తొలగించడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

అలాగే ఒంటరి మహిళల పింఛన్ అర్హత వయస్సును 50 ఏళ్లకు పెంచి లక్షలలో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేశారన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక కూడాఇవ్వని జగన్ కు ఆ భూములను అమ్మే హక్కు ఎవరిచ్చారన్నారు. మూడేళ్లుగా అమరావతిని నిర్లక్ష్యం చేసి, అభివృద్ధిని నీరు గార్చి.. అప్పట్లో తాను ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇస్తామంటూ జగన్ సర్కార్ చెప్పడం సిగ్గు చేటన్నారు.   డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా ఆత్మకూరు ఉఫ ఎన్నికలో  వైసీపీకి ఓట్లు పెరగకపోవడమే జగన్ సర్కార్ పై ప్రజలలో పెల్లుబుకుతున్న  తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.   

తన హయాంలో నాణ్యమైన విద్యను అందించడంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం జగన్ మూడేళ్ల పాలనలో 19వ స్థానానికి పడిపోయిందనీ, టెన్త్, ఇంటర్   పరీక్షల్లో ఫెయిలై 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనీ, ఆ పాపం పూర్తిగా జగన్ సర్కార్ దేనని విమర్శించారు.  . సొంత బ్రాండ్లతో జగన్ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. మద్యం నాణ్యతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మైనార్టీ యువతులకు టీడీపీ ఇచ్చిన రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచుతానని హామీ ఇచ్చి జగన్ ఇప్పుడునిధుల్లేక ఆ పథకాన్నే  నిలిపివేశామని హైకోర్టులో చెప్పడం ఆయన మోసకారి తనానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు.    .

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.