దొంగ రంగారావు...కేసీఆర్ దొర...అన్నదమ్ములేనా?
Publish Date:Jan 3, 2012
Advertisement
హైదరాబాద్: కేసిఆర్ నాయకత్వాన తెలంగాణా ఉద్యమం ఊపందుకున్నప్పుడల్లా విప్లవ గాయకుడు గద్జర్, ఎం.ఆర్.పి.ఎన్. నాయకుడు మందా కృష్ణ మాదిగ వంటి నాయకులు రంగంలోకి దిగి తమకు దోపిడీ దొరల రాజ్యం వద్దని పదే పదే చెబుతుంటారు. కేసిర్ దోపిడీ దొరలకు ప్రతినిధి - అందుకే అటువంటి వ్యక్తుల నాయకత్వంలోని రాజ్యం తమకొద్దని వారు అంటున్నారని ఎవరికైనా తేలికగా అర్థం అవుతుంది. అయితే ఆ ఇద్దరి నాయకుల ఉద్దేశ్యాలు అవి కావని తెలుస్తోంది. ఇటీవల కొందరు తెలంగాణా మీడియా మిత్రుల వద్ద వీరిద్దరూ ఇష్టాగోష్టిగా మాట్లాడతూ తాము చెబుతున్న దోపిడీ దొరల వివరాలు సవివరంగా వెల్లడించినట్లు తెలిసింది. కేసిర్ తండ్రిది చింతమడక ప్రాంతం. వారికి అక్కడ మూడెకరాల భూమి, ఒక పెంకుటిల్లు ఉండేది. కేసిఆర్, అతని అన్న రంగారావు తండ్రిని పెద్దగా లెక్క చేసేవారు కాదు. చిన్నప్పటి నుంచి మద్యానికి అలవాటు పడ్డారు. కేసిఆర్ అన్నరంగారావు చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలు కూడా చేసేవాడట. అతను చైన్ స్నాచర్ గా పేరు పొందాడు. దొంగతనాలు చేయడం వల్ల అతన్ని చింతమడక ప్రాంతంలో దొంగ రంగారావని పిలిచేవారట. ఇతనికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసిఆర్ రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించినప్పటికి ఈ కుటుంబాన్ని ఏనాడూ ఆదరించలేదని అనారోగ్యంతో రంగారావు మరణించాడని తెలిసింది.
ఇక కేసిఆర్ విషయానికి వస్తే అతను కూడా అన్న కన్నా తక్కవేమీ తినలేదని తెలిసింది. 1995 -89 సంవత్సరాల మధ్య అతను గొల్లలు, ఎన్.సి. ల నుంచి డబ్బులు వసూలు చేసి వారిని గల్ఫ్ దేశాలకు పంపిస్తానని మోసం చేసినట్లు తెలిసింది. అప్పట్లో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. 1989లో రవీంద్ర అనే నాయకుడి పేరిట రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్.ఎన్.యు.) కేసిఆర్ పై డెత్ వారెంట్ జారీ చేసింది. దీనితో బెంబేలెత్తి పోయిన కేసిఆర్ అప్పట్లో పలుకుబడి గల నాయకులైన ఎం.సత్యనారాయణ రావు (ప్రస్తుత ఆర్.టి.సి. చైర్మన్), మదన్ మోహన్ లను ప్రాదేయపడి తనను కాపాడమని వేడుకున్నట్లు తెలిసింది. ఎం. సత్యనారాయణ రావు చొరవ తీసుకుని ఈ డెత్ వారెంట్ ను రద్దు చేయించినట్లు గద్దర్, మంద కృష్ణమాదిగ తెలంగాణా జర్నలిస్టులకు వివరించినట్లు తెలిసింది. ఇదండీ దోపిడీ దొరల రాజ్యం వెనుక ఉన్న అసలు సిసలైన కధ!
http://www.teluguone.com/news/content/kcr-24-10551.html





