కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం?.. దళిత బంధు ఓట్ల కోసమే!
Publish Date:Jun 1, 2022
Advertisement
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఎటీఎం వంటిదని కాంగ్రెస్, బీజేపీలు తరచూ చేసే విమర్శలు. అయితే టీఆర్ఎస్ వాటన్నిటినీ రాజకీయ విమర్శలని కొట్టి పారేస్తూ వచ్చింది. తెలంగాణకు జీవధార వంటి ప్రాజెక్టు అంటూ భుజ కీర్తులు తగిలించుకుంది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణాన్ని పెంచే వరప్రదాయనిగా అభివర్ణించింది. అయితే ఒక రిటైర్డ్ అధికారి మాత్రం కాళేశ్వరం ఒక దండుగమారి ప్రాజెక్టు అంటూ సంచలన విమర్శలు చేశారు. ఆయన కూడా కేసీఆర్ కు ఎన్నికల వ్యయానికి తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు మరెందుకూ కొరగాదని విమర్శలు గుప్పించారు. ఐదేళ్లలో కాళేశ్వరం మూత తప్పదని జోస్యం కూడా చెప్పేశారు. ఆయనేమీ సాదా సీదా మనిషి కాదు. భూపాలపల్లి జల్లా కలెక్టర్ గా పని చేసి రిటైర్ అయిన అధికారి. ఆయన పేరు ఆకునూరి మురళి. ఇటీవల ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యలో కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసం రూపొందిన ప్రాజెక్టుగా అభివర్ణించారు. అదొక దొంగ ప్రాజెక్టనీ, ప్రపంచంలోనే ఇంతటి దండగమారి ప్రాజెక్టు మరొకటి ఉండదనీ విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తెల్ల ఏనుగన్నారు. ఐదేళ్లకు మించి దానిని నిర్వహించడంరాష్ట్రానికి సాధ్యం కాదని చెప్పారు. తొలుత కాళేశ్వరం వ్యయం రూ.36 లక్షల కోట్లుగా ప్రతిపాదించిన కేసీఆర్ ఆ తరువాత రూ.42 లక్షల కోట్లకు, ఇప్పుడు లక్ష కోట్లకూ పెంచేశారని గణాంక సహితంగా వివరించారు. కాళశ్వరం ప్రాజెక్టు వల్ల 15లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయిని నిరూపిస్తే.. దేనికైనా సిద్ధమని అకునూరి మురళి అన్నారు. ఎకరా వరికి నీరు పారించాలంటే రూ.50 వేలు విద్యుత్ ఖర్చు అయ్యే ప్రాజెక్టు ఐరావతం కాక మరేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే దళిత బంధు కూడా ఎన్నికల్లో ఓట్ల కోసం పుట్టుకొచ్చిన పథకమే తప్ప దాని వల్ల దళితులకు ఏ విధమైన ఉపయోగం ఉండదన్నారు. నియోజకవర్గానికి ఏడాదికి 100 మందికి చొప్పున దళిత బంధు అంటే..రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకం వర్తింప చేయడానికి 156 ఏళ్లు పడుతుందని లెక్కలు చెప్పారు.
http://www.teluguone.com/news/content/kaleswaram-an-atm-to-kcr-retired-ias-sesational-comments-25-136788.html





