కాకినాడ కార్పొరేషన్ కబ్జాయత్నం.. హైకోర్టు సంచలన తీర్పు.!

Publish Date:Jul 29, 2026

Advertisement

 

15 కోట్ల రూపాయల విలువైన   కార్పొరేషన్ స్థలాన్ని అప్పనంగా కొట్టేయడానికి   పక్కా స్కెచ్ వేసి.. కోర్టునే బురిడీ కొట్టించడానికి చేసిన ప్రయత్నంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయ్యింది.  ఈ కబ్జా ప్రయత్నానికి హైకోర్టు చెక్ పెట్టింది.  వివరాల్లోకి వెడితే.. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన  భూమిపై కొందరు కబ్జాదారుల కన్ను వేశారు. సాధారణంగా భూకబ్జాదారులు పేపర్లు మర్చేస్తారు, లేదా బెదరింపులకు దిగుతారు. కానీ కాకినాడ కార్పొరేషన్ భూమి కబ్జా కోసం నిందితులు  వ్యవస్థలోని లొసుగులు ఆసరా చేసుకుని, న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవపట్టించి కోట్లాది రూపాయల భూమిని, అదీ ప్రజోపయోగం కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జాచేసి తన ఖాతాలో వేసుకోవాలని చూశారు. న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించి, వ్యవస్థలోని లొసుగులను వాడుకుని, దాదాపు 15 కోట్ల విలువైన ప్రజా ఆస్తిని తమ ఖాతాలో వేసుకోవాలని చూశారు.

కాకినాడ రమణయ్యపేటలోని 700 గజాల స్థలాన్ని అక్రమంగా దక్కించుకునేందుకు కోర్టును తప్పుదోవ పట్టించే ఈ ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు అడ్డుకుంది.    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందుకు వచ్చినప్పుడు, ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 ఈ కుట్ర వెనుక ఎవరెవరున్నారన్నది తేలాల్సిందే అని స్ఫష్టం చేస్తూ  ఐజీ  స్థాయి ఉన్నతాధికారితో సమగ్ర విచారణ జరపాలని ఏసీబీ  డైరెక్టర్ జనరల్‌ను ఆదేశిస్తూ సంచలన తీర్పునిచ్చింది! ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్  సంచలన వ్యాఖ్యలు చేశారు.

 న్యాయవాదులు న్యాయస్థానానికి సహకరించే అధికారులనీ, వారి మీద న్యాయవ్యవస్థకు అపారమైన విశ్వాసం ఉంటుందని గుర్తుచేశారు. అయితే అటువంటి వారే ఈ కేసు విషయంలో  కుమ్మక్కు, ద్వంద్వ ప్రాతినిధ్యం, కోర్టును మోసం చేసే చర్యలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు.  

ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు కూడా  బాధ్యతలు  నిర్వర్తించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.  ఒక వైపు అధికార యంత్రాంగం, మరోవైపు పక్కాగా వేసిన లీగల్ స్కెచ్... వీటిన్నింటినీ ఛేదించి, అసలు సూత్రధారులు ఎవరో తేల్చేందుకు ఏసీబీ ఇప్పుడు రంగంలోకి దిగింది. 

Kakinada Land Scam, AP High Court, ACB Investigation, Kakinada Municipal Corporation, AP News, Land Grab Lawsuit, Andhra Pradesh High Court Order

By
en-us Political News

  
నిందితుడైన మోటెగావ్‌కర్‌కు ఉన్న రాజకీయ పరిచయాలు, సన్నిహిత సంబంధాలు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమిత్ దేశ్‌ముఖ్ తరఫున ఆయన ప్రచారం చేసిన రికార్డులు వెలుగులోకి రావడం వల్ల ఈ కుంభకోణం చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. సిబిఐ తన నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం, నీట్ కెమిస్ట్రీ పేపర్‌ను రహస్యంగా పొందడానికి మోటెగావ్‌కర్ ఎన్‌టీఏ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ పి.వి. కులకర్ణికి రూ. 5 లక్షలు చెల్లించినట్లు స్పష్టమైంది.
నాపై జరుగుతున్న ప్రచారాన్ని ఆపండి అంటూ బాధితురాలి విజ్ఞప్తి..!
హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో
ప్రభుత్వం చేపట్టిన బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎదురవుతున్న చిక్కులను తొలగిస్తూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. పాలమూరు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతొ ఆ ప్రాజెక్టులపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది.
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మెట్రో ప్రయాణం ఒక హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన కాన్వాయ్‌ను పక్కన పెట్టి, సరాసరి మెట్రో స్టేషన్‌కు చేరుకుని సాధారణ ప్రయాణీకుడిలా క్యూ లైన్‌లో నిలబడి టికెట్ కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణికుల మధ్య కూర్చుని పక్కన ఉన్న వారితో ముచ్చటించారు.
జలాశయాలకు వరద నీరు పోటెత్తుతుండటంతో ఏడాదంతా సాగునీటికి కొదవ ఉండదని రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వరద తాకిడికి పలు గ్రామాలు ముంపునకు గురికావడం, రహదారులు జలమయమై రాకపోకలు స్తంభించడంతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు.
అమెరికాలోని ఎంపోరియాలో 1,000 ఎకరాల డేటా సెంటర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్‌లో చప్పట్లు కొట్టినందుకు లక్స్ క్లారిడ్జ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగ హక్కులు, 1 గిగావాట్ విద్యుత్ వివాదం మరియు ఈ సంచలన ఘటన వెనుక ఉన్న పూర్తి నిజాలు ఇక్కడ చదవండి!
గూగుల్ పేలోకి Gemini AI సాంకేతికతతో Ask Google Pay ఫీచర్ వచ్చింది. మీ ఖర్చులు, పొదుపు మార్గాలు మరియు CIBIL స్కోర్ వివరాలను 10 భారతీయ భాషల్లో సులభంగా తెలుసుకునే విధానం గురించి పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.
AIG ఉమెన్స్ ఓపెన్ 2026 ప్రత్యక్ష ప్రసారాలు, నెల్లీ కోర్డా గ్రాండ్ స్లామ్ వేట, మియు యమషిత డిఫెండింగ్ రికార్డులు మరియు మ్యాచ్ సమయాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
2024 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా ఎంపికై, ప్రత్యేక సెలవులో ఉండటంతో 2025 బ్యాచ్‌తో కలిసే శిక్షణలో చేరారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది.
కాకినాడ జిల్లాకు చెందిన దర్జీ కుమారుడు మాల్తి అఖిలేశ్ సంచలన విజయం సాధించాడు. కెనడా ఏఐ సంస్థలో ఏడాదికి రూ. 1.06 కోట్ల ప్యాకేజీతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పొందిన స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ చదవండి.
బెంగళూరులో రూ.2.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లను ఐటీ ఉద్యోగులు ఎలా కొనుగోలు చేస్తున్నారు రెడ్డిట్ వేదికగా వైరల్ అవుతున్న ఆసక్తికర వివరాలు, టెక్కీల అసలు సీక్రెట్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 9,275 కోట్ల మెగా ఐపీఓ పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్రైస్ బ్యాండ్, లేటెస్ట్ జిఎమ్‌పి GMP , సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, అలకేషన్ తేదీలు మరియు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలు ఇక్కడ క్లియర్ గా చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.