బిఆర్ఎస్ స్కాంలకు కడియం అప్రూవర్ పాత్ర ?
Publish Date:Apr 2, 2024
Advertisement
బీఆర్‌ఎస్ నేతలు అందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని, వాటిని బయటపెడితే తట్టుకోలేరని కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు. తాను పార్టీ మారడంపై విమర్శలు చేస్తున్న వారి చరిత్ర తనకు తెలుసన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ను వీడటం బాధగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరక తప్పలేదని వివరించారు. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఆర్థిక నేరాల చిట్టా రేవంత్ రెడ్డి సర్కార్ విప్పుతోంది. అయితే ఆర్థిక నేరాల మీద కాంగ్రెస్ సీరియస్ గానే ఉంది. ఫోన్ ట్యాపింగ్ స్కాం ద్వారా బిఆర్ఎస్ సర్కార్ చేసిన అవినీతి చిట్టా బయటపడనుంది. నేరాలు కోర్టుల్లో రుజువు కావడానికి అప్రూవర్ లు ముఖ్య భూమిక వహిస్తారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేయడంతో బిఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరారు. 80 ఏళ్లు దాటిన కె. కేశవ్ రావ్ వంటి సీనియర్ నేతలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. బిఆర్ఎస్ పాపాల చిట్టా ఈ ముఖ్య నేతల వద్ద ఉంది. కాబట్టి ఈ చిట్టాన్నిబయట పెట్టడానికే కడియం శ్రీహరి వంటి నేతలు రేవంత్ రెడ్డికి అవసరముంది. కాబట్టే తండ్రీ కూతుళ్ల చేరికలను రేవంత్ ప్రోత్సహిస్తున్నారు. గద్వాల్ విజయలక్ష్మి, కె. కేశవ్ రావ్, డాక్టర్ కావ్య , కడియం శ్రీహరి వంటి నేతలను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. వీళ్లంతా బిఆర్ఎస్ నేతల నేరాలకు అప్రూవర్ గా మారనున్నారు. కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నేతలు బిఆర్ఎస్ సుప్రీం అయిన కెసీఆర్ ను పల్లెత్తు మాట అనలేదు. కానీ బిఆర్ఎస్ అవినీతి పాలనపై తూర్పారబట్టారు. కడియం వంటి నేతలు బిఆర్ఎస్ స్కాంల వల్ల తన కూతురు బలి కావొద్దన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వివరించారు. రాజకీయాల్లో కొత్తగా చేరిన తన కూతురు బిఆర్ఎస్ తరపున పోటీ చేస్తే పరాజయం చెందడం ఖామని కడియంకు అర్థమైంది. కాబట్టే తనతో బాటు కూతురును కాంగ్రెస్ లో చేర్చారు. కాంగ్రెస్ లో చేరిన వెంటనే అదే వరంగల్ టికెట్ తెచ్చుకున్నారు. డిసెంబర్ లో కాంగ్రెస పార్టీ పై ఒంటికాలితో లేచిన కడియం చివరకు అదే పార్టీ చేరారు. కేవలం మూడు నెలల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో విపరీత మార్పు చోటు చేసుకుంది. మెజారిటీ బిఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ సర్కార్ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఆరునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పిన నేతల్లో కడియం ముందు వరసలో ఉన్నారు. విధి బలీయమైనది. బిఆర్ఎస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి. కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై తనకు గౌరవం ఉందని, ప్రత్యేకంగా ఆయనపై ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదని కడియం ఇప్పటికే క్లారిటి ఇచ్చారు. బిఆర్ఎస్ నేతలు పదుల సంఖ్యలో పార్టీ మారుతున్నా ఎవరిపైనా స్పందించని బీఆర్ఎస్ నేతలు కడియంపై ఫోకస్ పెట్టారు. అందరిని వదిలేసి తనను మాత్రం ఎందుకు టార్గెట్ చేసినట్లు మాట్లాడుతున్నారని కడియం అడిగారు. నా విషయంలో వారు మాట్లాడే పద్దతి బాగోలేదన్నారు. జిల్లా స్థాయి నేతలు కూడా తనపై అనవసర కామెంట్స్ చేయడాన్ని కడియం ఆరోపించారు. పాలకుర్తి ప్రజలు చీకొట్టినా ఎర్రబెల్లి దయాకర్ కు బుద్ధి రాలేదని, ఆయన ఏంమాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని కడియం ఎద్దేవా చేశారు. అహంకారపు మాటలు తగ్గించుకుంటే ఆయనకే మంచిదని హితవు పలికారు. బీఆర్‌ఎస్ కు ఇలాంటి దుస్థితి రావడానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి నేతలే కారణమని కడియం ఆరోపించారు. పల్లా చేసినవన్నీ అసత్య ఆరోపణలేనని కొట్టిపారేశారు. పల్లా ఆరోపణలకు ఆధారాలు చూపించకుంటే ఆయనను జనగామలో బట్టలు ఊడదీసి నిలబెడతానని కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్‌కు కూడా కడియం వార్నింగ్ ఇచ్చారు. మానుకొండూరు ప్రజలు చిత్తుగా ఓడించినా బుద్ధి లేకుండా అనవసర మాటలు మాట్లాడుతున్నాడని కడియం మండిపడ్డారు.
http://www.teluguone.com/news/content/kadiam-approver-role-for-brs-scams--25-173130.html