కడప ఉక్కు కర్మాగార నిర్మాణ పనులకు రంగం సిద్ధం

Publish Date:Jun 11, 2026

Advertisement

 

సీమవాసుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి జిల్లాలో అతి త్వరలో ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనుల ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని సున్నపురాళ్ళ పల్లె వద్ద జేఎస్ డబ్ల్యూ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఉక్కుకర్మాగారం శిలాఫలకం వేసిన ప్రాంతాన్ని గురువారం సాయంత్రం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి,స్థానిక ఎమ్మెల్యే సి.ఆదినారాయణ రెడ్డి, ఆ కంపెనీ ప్రతినిధులుకలిసి పరిశీలించారు.  

జమ్మలమడుగు నియోజకవర్గం  సున్నపురాళ్లపల్లెలో 3500 ఎకరాల్లో రూ.8,800 కోట్లతో 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు మూడేళ్ల క్రితం శిలాఫలకం వేయడం జరిగింది. అయితే.. ఈ కర్మాగార నిర్మాణం తొలిదశ కూడా ప్రారంభం కాకపోవడంతో ఈ ప్రాంతవాసుల కలను సాకారం చేసే దిశగా త్వరలో పరిశ్రమ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గతంలో జిందాల్ గ్రూపు సంస్థకు గత ప్రభుత్వం దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన భూములను కేటాయింపు, ఒప్పందాలు, ప్రస్తుత పరిస్థితులు, పరిశ్రమ నిర్మాణానికి కావాల్సిన అనుకులతలు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మొదలైన అంశాలపై కంపెనీ ప్రతినిధులతో  జిల్లా కలెక్టర్చర్చించారు. 

శంఖుస్థాపన చేయనున్న చంద్రబాబు 

వీలైనంత త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ  దిశగా  కలెక్టర్ , జిందాల్ సంస్ధ ప్రతినిధులు ఏర్పాట్లను చేపడుతున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం ప్లాంట్ సైట్ ప్రాంతంలో ఉన్న రెండు  హెలిపాడ్ల స్థితిగతులను, మిగతా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే, జేఎస్ డబ్ల్యూ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించడంతో ముఖ్యమంత్రి పర్యటన దాదాపు ఖరారైనట్లు చెప్పుకోవచ్చు. ఈ కర్మాగారం నిర్మాణం కార్యరూపం దాల్చితే జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వడం, వేలాది మంది యువతకు మెండైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతుంది.

By
en-us Political News

  
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను రాష్ట్ర విద్యాశాఖ తీవ్రంగా ఖండించింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం పాలసీ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక అడుగు వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న మద్యం రవాణా కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరోసారి అత్యంత భీకరంగా కమ్ముకున్నాయి
పశ్చిమ ఆసియాలోని హార్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ అంతర్జాతీయ సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతలు భారతీయ నావికుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.
దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మల్కాజ్‌గిరిలో సంచలనం సృష్టించిన నిషారాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం పెను సంచలనంగా మారింది.
మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాల యానికి తరలించారు. లిక్కర్ రవాణా వ్యవహారా ల్లో ఆయన పాత్రపై అధి కారులు విచారణ చేపట్టారు.
కోడి కూర చేయడానికి ఓపిక లేదనీ, రేపు వండుతానని చెప్పింది. అయితే తప్పతాగి ఉన్న రమేశ్ కోడి కూర ఇప్పుడే వండాలంటూ భార్యపై చేయి చేసుకున్నాడు.
పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.