Publish Date:Jun 11, 2026
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒమన్ తీరంలోని హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా సైనిక బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులుప్రాణాలు కోల్పోయారు. తొలుత వీరు గల్లంతైనట్లు భావించినప్పటికీ.. వారు మరణించినట్లు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ అధికారికంగా ధృవీకరించారు.
పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి. ఈ దాడిలో నౌక పూర్తిగా దెబ్బతింది. నౌకలోని 24 మంది భారతీయులలో 21 మందిని ఒమన్ అధికారుల సహాయంతో సురక్షితంగా రక్షించగా, ముగ్గురు గల్లంతయ్యారు. తాజాగా ఆ ముగ్గురి మృతదేహాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/three-indian-sailors-killed-in-us-attacks-36-222601.html
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.