జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెన్షన్.!
Publish Date:Jul 29, 2026
Advertisement
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేసి ప్రస్తుతం వీఆర్ లో ఉన్న ఇన్ స్పెక్టర్ శ్రీనివా సులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆయనపై ఓ మహిళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించినట్లు గుర్తించ డంతో ఈ చర్యలు తీసుకు న్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసుల సమాచారం ప్రకారం ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళతో పరిచయం పెంచుకున్న శ్రీనివాసులు రెడ్డి, ఆమెను నమ్మించి శారీరక సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. ఆ తరువాత ఆ మహిళకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది.ఇ న్ స్పెక్టర్, బాధిత మహిళ కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ పరిణా మాల నేపథ్యంలో బాధిత మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధి కారులు చేపట్టిన విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరా బాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. Hyderabad Police Sexual Assault Case, Extortion Case Hyderabad Police, CP Sajjanar
http://www.teluguone.com/news/content/jublee-hills-ci-suspended-36-227434.html





