జూబ్లీ హిల్స్‌లో సెంటిమెంటో గెలుస్తుందో డెవలప్‌మెంటో గెలుస్తుందో తెలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.షేక్ పేట డివిజన్ పారా మౌంట్ కాలనీలో ముఖ్యమంత్రి ప్రచార సభ నిర్వహించారు. కిషన్ రెడ్డి..ఎందుకు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వొద్దు? నీ అబ్బ జాగీరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే నీకు ఏం ఇబ్బందని రేవంత్ అన్నారు. రెహమత్ నగర్ లో నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు మైనార్టీలకు అనేక అవకాశాలు కల్పించిందని స్ఫష్టం చేశారు.
కాంగ్రెస్ అంటే ముస్లిం..ముస్లిం అంటే కాంగ్రెస్ అని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో నేను మూడు సార్లు గెలవడానికి మైనార్టీల సహకారం ఎంతో ఉందని సీఎం అన్నారు. ప్రధాని మోదీ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కటే అని కేసీఆర్ ప్రతి సారి కేంద్రంలో మోదీకి మద్దతు ఇచ్చాడని రేవంత్ అన్నారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని..బీఆర్ ఎస్ ముస్లిం లను మోసం చేస్తుందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ పైన సీబీఐ విచారణ అడిగితే మోదీ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ కార్ రేస్ కేసు లో కేటీఆర్ అరెస్ట్ కోసం గవర్నర్ అనుమతించడం లేదని తెలిపారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ తెచ్చుకోవాలని రేవంత్ సవాల్ విసిరారు. జూబ్లీ హిల్స్ గ్రౌండ్ లో అసలు బీజేపీనే లేదని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jubilee-hills-39-209076.html
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!