మంగళగిరి నియోజకవర్గాల్లో సరిగ్గా గ్రీవెన్స్ నిర్వహించడం లేదని, నాయకులు ప్రజల సమస్యలు సరైన రీతిలో పరిష్కరించివుంటే మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కు 4వేల మంది ఎందుకు వస్తారు అని నాయకులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు మండిపడ్డారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యటించిన ఆయన పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలతో ఆయన మాట్లాడుతూ.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి అని ఆదేశించారు.
ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని కోరారు. నవంబర్ 15వ తేది లోపు నియోజకవర్గ కమిటీల నుంచి గ్రామ స్థాయి కమిటీల వరకు పార్టీ నియామకాలు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. 15వ తేది లోపు పూర్తి చేయలేకపోతే జాతీయ అధ్యక్షులు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక సంస్కృతి. క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. కొందరి నాయకుల వలన పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు వారి ప్రవర్తన మార్చుకోవాలని, మరలా పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో పార్టీ నాయకులు సఫలం కావాలి, దానికి తగ్గట్టు నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో నిర్వహిస్తూ.. క్యాడర్ ను కలుపుకుంటూ.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని సూచించారు. కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది.. అందరూ సఖ్యతతో పనిచేయాలి.. సంయమనం పాటించండి.. సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టండంతో పాటు వైసీపీ దుష్ప్రచారాలకు ప్రజలు ప్రభావితం కాకుండా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేయండని కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, జోనల్, పార్లమెంట్, నియోజకవర్గ ఇంచార్జులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/grievances-39-209071.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!