ఏపీలో పొత్తుల పై రాజకీయ పార్టీల మధ్య సంప్రదింపులే కాదు.. సామాన్య జనంలో చర్చోపచర్చలూ జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాన్ ఆప్షన్లు అంటూ చేసిన ప్రకటనతో రాష్ట్రంలో సామాన్య జనంలో ఈ చర్చ మరింత జోరందుకుంది. అయితే ఈ చర్చల్లో జనసేనాని అప్షన్లపై ప్రజలలో అసహనం కనిపిస్తున్నది. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న ఆయన మనోభీష్టంపై సామాజిక మాధ్యమంలో ట్రోలింగ్ ఒక రేంజ్ లో సాగుతోంది.
బలం ఏమిటో తెలియకుండా నేల విడిచి సాము చేయడంలా ఉంది ఆయన వైఖరి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలుగుదేశం వర్గాలలో అయితే పవన్ ఆప్షన్లపై ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో బలమైన విపక్షంగా తెలుగుదేశం జనసేనను కానీ, జనసేన పార్టీని కానీ భుజాన మోయాల్సిన పని లేదని తెలుగుదేశం వర్గాలు విస్పష్టంగా చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ స్వయంగా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వం అంటూ చేసిన ప్రకటన కారణంగానే ఆ పార్టీతో పొత్తు అన్న చర్చ తెరమీదకు వచ్చింది తప్ప.. తెలుగుదేశం పార్టీకి జనసేనానితో అంటకాగాల్సిన అవసరం ఇసుమంతైనా లేదని తెలుగుదేశం వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి.
పొత్తు ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విజయం సాధించి అధికారంలోకి రావడం తథ్యమన్న ధీమా ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. జనసేన అధినేతను మోయాల్సిన అవసరం పార్టీకి లేదన్ని ఆ వర్గాలు కుండ బద్దలు కొడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయను అన్న జనసేన మాటల వెనుక వ్యూహం ఏమిటన్నది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న ఆయన ఆకాంక్షను బయటపెట్టుకోవడంతోనే బహిర్గతమైపోయిందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
ఆపరేషన్ టు డిస్ట్రాయ్ తెలుగుదేశం అన్నదే ఆ కుట్ర అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ప్రస్తతం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ వైసీపీ పాలన పట్ల విసిగిపోయి ఉన్నారని తెలుగుదేశం వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాకుండా, గత ఎన్నికలలో వైసీపీకి పడిన ఓట్లలో కూడా అధిక భాగం ఈ సారి తెలుగుదేశం కైవసం చేసుకంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పొత్తు అంటూ ముందుకు వచ్చి తెలుగుదేశం గెలిచే సీట్ల సంఖ్యను తగ్గించడమే జనసేన వ్యూహమని ఆ వర్గాలు అంటున్నాయి.
పొత్తులో భాగంగా ఓ 50 అసెంబ్లీ స్థానాలను జనసేన డిమాండ్ చేస్తుందనీ, ఆ పార్టీకి అన్ని సీట్లు గెలిచే సత్తా లేదనీ తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఇందులో వ్యూహమేమిటంటే తెలుగుదేశం గెలిచే స్థానాలను పరిమితం చేయడమేనని పేర్కొంటున్నారు. అధిక స్థానాలలో అదీ తెలుగుదేశం గెలిచే స్థానాలకు పట్టుబట్టడం ద్వారా వైసీపీ ఎక్కువ నియోజకవర్గాలలో గెలిచేందుకు సహకరించాలన్నదే జనసేనాని వ్యూహంగా కనిపిస్తోందని వివరిస్తున్నాయి. అందుకే జనసేనతో పొత్తు తెలుగుదేశం పార్టీకి భారమే అవుతుందని తెలుగు దేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/janasena-not-strength-to-tdp-it-is-a-burden-25-137323.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.