అస‌లు త‌ప్పు త‌లిదండ్రుల‌దే ..!! హోం మంత్రి ఉవాచ‌!

Publish Date:Jun 9, 2022

Advertisement

ఆడ‌పిల్ల‌లు, మ‌హిళ‌ల  మీద అఘాయిత్యాలు, హ‌త్య‌లూ  ఇటీవ‌ల పెరిగిపోతున్నాయి. గ‌త వారం రోజులు గా నానుతున్న జూబ్లీహిల్స్ కారులో రేప్ కేసులో నిందితుల సంగ‌తి తెలిసి కొంద‌రిని ప‌ట్టుకుని వారిలో అధిక భాగం మైన‌ర్లే అని తేల్చి ఒక‌రిద్ద‌రిని జ్యూవెన‌ల్ హోమ్ కి త‌ర‌లించేరు. అక్క‌డ బాగుబ‌డి ర‌మ్మ‌ని. అస లు నింది తులు మైన‌ర్లేన‌ట‌.

రాజ‌కీయప్ర‌ముఖుల పిల్ల‌లు నిందితుల్లో వున్నార‌ని కేసు నానుస్తున్నార‌ని రాష్ట్ర‌మంతా కోడై కూస్తోంది. పోలీసులు ఇంకా నీళ్లు న‌ములుతూనే వున్నారు. ఈలోగా   తెలంగాణా   హోం శాఖ మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అలీగారు బుధవారం గొప్ప వ్యాఖ్యానం చేసేరు. మైన‌ర్లు  ఇంత ఘాతుకానికి  ఒడిగ‌ట్ట‌డ మేమిటి?   దీనికి వారి త‌లిదండ్రుల‌దే త‌ప్ప‌ని!  ఉరుము ఉరిమి ఇంటి  మీద ప‌డింది!  పిల్ల‌ల  పెంప‌కం, వారి చ‌దువులు, న‌డ‌వ‌డిక అన్నీ త‌లిదండ్రులే చూసుకోవాలి.  బాగానే వుంది.  కానీ రోజు లు మారిపోయాయి. ఇపుడంతా మొబైల్ కాలం.

అన్నీ అందులోనే. పిల్ల‌ల‌కి, వుద్యోగుల‌కూ కావ‌ల‌సిన స‌మాచారాల‌కు, స‌ర‌దాల‌కూ మ‌రో  మార్గ‌ద‌ర్శిగా మారిపోయింది మొబైల్. చ‌దువుకు సంబంధించి, స‌ర‌దాల‌కు సంబంధించిన ప్ర‌తీ చిన్న విష‌యం కూడా దాని తోనే సాధ్య‌మ‌వుతోంది. స్నేహాలు విస్త‌రిస్తున్నాయి. ఇందులో ఆడ‌, మ‌గా తేడా లేదు.  ఇపుడు ఇది ఓ పెద్ద  ఫ్యాష‌న్‌! చేతిలో ఖ‌రీద‌యిన మొబైల్ లేక‌పోయి నా, న‌లుగురితో ఏక‌కాలంలో చాటింగ్ లేక పోయినా కూడా ఇప్ప‌టి యూత్ వారిని  వెలివేసి నంత ప‌ని చేస్తున్నారు. అన్ని ర‌కాల స‌మాచారాలు, సినిమాలు, విధ్వంస‌క దృశ్యాలు, మాన‌సిక దౌర్బ‌ల్యా ల ప్రేర‌కాలు కూడా అదే ప్ర‌సాదిస్తున్న కాలంలో యువత‌ను కాపాడుకో వ‌డం త‌లిదండ్రుల‌కు క‌త్తి మీద సాముగానే మారింది. అయితే ఇది ఎంత‌వ‌ర‌కూ క‌ట్ట‌డి చేయ గ‌ల్గుతారు? బ‌డికి, కాలేజీకి, వుద్యోగా నికి వెళ్లే ఆడపిల్ల‌ల‌కు ర‌క్ష‌ణార్ధం అనేక సౌక‌ర్యాలున్న మొబైల్ అందించ‌క త‌ప్ప‌డం లేద‌ని త‌లిదండ్రులే అంటు న్నారు.  ఎప్పుడైనా స‌మ‌స్య ఎదుర‌యి న‌పుడు వెంట‌నే తెలిసి ప‌రుగులు పెట్ట‌డానికి వీల‌వుతుంద‌ట‌! కానీ ప్ర‌భుత్వాలు,పోలీసు వ్య‌వ‌స్థ   అందిస్తున్న యాప్ లతోనే అమ్మాయిలకు రక్షణ లభిస్తుందంటే  ఇంకేమి?  ఘాతుకాలు, దాడులు తెలిసి జ‌ర‌గ‌వు. హ‌ఠాత్తుగానే జ‌రుగుతా యి.

వాటి నుంచి త‌ప్పించు కోవ డానికి  చేసే ప్ర‌య‌త్నంలో  త‌ప్పించుకోవ‌డానికి చేసే ప్ర‌య‌త్నంలోనే ప్రాణం పోతున్నంత ప‌ని అవు తుంది గ‌దా!

ఇటీవ‌లి కాలంలో స్కూళ్లు, కాలేజీల్లో చేరుతున్న పిల్ల‌ల‌కు అనేకానేక జాగ్ర‌త్త‌లు త‌లిదండ్ర‌లు తీసుకుం టున్నారు. అయినా ఎక్క‌డోక్క‌డ‌, ఏదో రోజు, ఏదోక క్ష‌ణాన స్నేహితుడ‌నే వాడో,  తెలిసిన‌వాడో, ఏకంగా టీచ‌రో, ఆటోవాడో అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. ప్ర‌తీఒక్క‌రం ప‌క్క‌వాడిని చూసి భ‌యం భ‌యం గా బ‌తికేయాల్సిన దారుణ కాలంలో బ‌త‌కాల్సి వ‌స్తోంది.

దారుణాలు జ‌రిగినపుడ‌ల్లా పోలీసులు దాదాపు వెంట‌నే స్పందించ‌డం, నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం జరుగుతోంది. కానీ ఇటీవ‌ల ప‌బ్‌ల చుట్టూనే ఇలాంటి  ఉదంతాలు చోటు చేసుకోవడ‌మే మ‌రీ అన్యాయంగా మారింది.  ప‌బ్‌ల‌కు వెళ్ల‌డం,స‌ర‌దాగా స్నేహితుల‌తో గ‌డ‌ప‌డం అనేది  ఈ రోజుల్లో చాలా మామూలు సంగ‌తి! కానీ  తాగి కార్లు న‌డ‌ప‌డం, స‌ర‌దాల్లో భాగంగా విచ్చ‌ల‌విడిగా తిర‌గ‌డం స్థాయి నుంచి ఇపుడు గంజాయి, మ‌త్తు మందుల మ‌త్తులో చిత్త‌యి జీవితాలు కోల్పోవ‌డం సంఖ్య పెరుగుతూనే వుంది.  అస‌లు ప‌బ్‌ల‌కు ఇస్తున్న స్వేచ్ఛ‌, లైసెన్స్‌లు గురించి పోలీసులు సీరియ‌స్‌గా ఎందుకు తీసు కోరో అర్ధంగానిదేమీ లేదు. వాటి య‌జ‌మానులో, మ‌ద్ద‌తుదారులో  రాజ‌కీయ‌రంగంలోనో, వ్యాపార రంగం లోనే  బిగ్‌షాట్స్ అనే స‌మాచారంతో ఎవ‌రికీ తొంద‌ప‌డి చ‌ర్య తీసుకోవ‌డానికి కాళ్లూ చేతులు ఆడ‌వు.  ఫిర్యా దులు అలానే వుంటాయి.  

ఆరోప‌ణ‌ల‌న్నీ గోడ‌మీద సున్నం.. అంతే! ప‌బ్‌లకు వెళ్లిన‌వారిలో స‌గం పైగా పిల్ల‌లు ఇష్ట పూర్వ‌కంగానే వెళుతుంటారు. బ‌ల‌వంతంగానో, స్నేహితుల మొహ‌మాటంతోనో వెళ్లే వారు త‌క్కువ‌. అక్క‌డ స‌ర‌దాల‌తో పాటు మ‌ద్యం మ‌త్తులో విప‌రీత నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, అందుకు కొంద‌రు తోడ్ప‌డ‌డం జీవితాల్ని ఛిద్రం చేస్తున్నాయి. ఇందుకు అబ్బాయిల‌నేకాదు, అమ్మాయిల‌నూ త‌ప్పు ప‌ట్టాల న్న ఆరోప‌ణ‌లూ వున్నాయి. 

మొన్న‌టితో ప‌బ్‌ల భాగోతాల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌న్న డిమాండ్  పెచ్చు మీరాయి.  ప‌బ్‌లు క్ర‌మేపీ  మ‌త్తు పానీయాల కంటే గంజాయి వాడ‌కానికి పెద్ద అడ్డాలుగా మారాయ‌న్న ఆరోప‌ణ‌లు ఎప్ప‌టి నుంచో వింటు న్నాం. దీన్ని గురించి పోలీసుల‌కు గ‌ట్టి స‌మాచారం ల‌భించినా, దోషుల‌ను ప‌ట్టుకోవ‌డంలో, వారిని  కోర్టుకి లాగ‌డం, శిక్షించ‌డం వేగిరం జ‌ర‌గాలి. కానీ లేటెస్ట్ కేసులో మాత్రం ఇంకా న‌త్త‌న‌డ‌క‌న సాగుతూనే వుంది.  పైగా మంత్రి మనవడు వున్నాడ‌న్న మాట బ‌య‌టికి పొక్క‌డంతో  పోలీసులు అతి జాగ్ర‌త్త‌లు తీసుకుం టున్నారు. . నామ్‌కే వాస్తే ఒక‌రిద్ద‌రిని అరెస్టు చేయ‌డంతో  బ‌య‌టి నుంచి వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను త‌ట్టుకోవ‌చ్చ‌ని అనుకున్నారు. 

చిత్ర‌మేమంటే ఇపుడు ఏకంగా  హోంమంత్రి అలీ గారు గొప్ప జ్ఞానం బోధించేరు. అదేమంటే అస‌లు పిల్ల‌ల పెంప‌క‌మే అట్లా ఏడిచింద‌ని. త‌లిదండ్రులు త‌మ పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌లో భాగంగా వారి న‌డ‌వ‌డిక‌ను కూడా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తుండాల‌ని బోధించేరు.  కేసులో త‌మకి సంబంధించిన‌వారు ఉన్నార‌న్న‌దానికి స‌మాధానంగా ఈ విధంగా కేసులో నిందితుల‌ను బ‌యటికి పొక్క‌నీయ‌కుండా ఈ విధ‌మ‌యిన స్టేట్‌మెంట్ల తో దారిమ‌ళ్లించే య‌త్నాలు, మ‌ర్చిపోయేట్టు చేసే య‌త్నాలు ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌స‌మో ప్ర‌భుత్వానికే తెలియాలి. 

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.