గేట్లెత్తేయగానే వరద గోదారి సముద్రంలో కలిసేందుకు ఉరుకులెత్తి ఉప్పొంగి పారుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల వరద అలాగే వెల్లువెత్తుతుందా అంటే పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ట వేగంగా మసకబారుతోందన్న అంచనాతో ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలు సహా కేడర్ తెలుగుదేశం వైపు చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాయల సీమ జిల్లాల నుంచి బలమైన నేతలు, కేడర్ కూడా చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్షఅని భావిస్తున్నారు. ఆ విషయమే బాహాటంగా చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వీరశివారె్డి, వరద రాజులు రెడ్డి, డీఎల్ రవీంద్రా రెడ్డి వంటి వారు తెలుగుదేశం గూటికి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఇటీవలి వారి మీడియా సమావేశాలు, ప్రకటనలను బట్టి అవగత మౌతున్నదని అంటున్నారు. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి జగన్ పాలన చూసి తుగ్లక్ కూడా నవ్వుకుంటాడని విమర్శించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బుధవారం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో బేటీ అయ్యారు. భేటీ అనంతరం వీలేకరులతో మాట్లాడిన ఆయన తాను త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇంత కాలం వైసీపీకి అనుకూలంగా ఉన్న ఆయన ఇప్పడు జగన్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబుతో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
నారా లోకేష్ తో బేటీలో రాష్ట్రంలో పరిస్థితులు, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించినట్లు చెప్పారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కూడా తెలుగుదేశం పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రకటించి తాను ఆ పార్టీలో చేరనున్నట్లు పేర్కొన్నారు.
ఇక మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి కూడా చంద్రబాబు విధానాలే రాష్ట్రప్రగతికి సోపానాలని పేర్కొన్నారు. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తతం వైసీపీలో ఉన్న ఆయన త్వరలో తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే జగన్ విధానాలను తీవ్రస్థాయిలో ఎండగడుతున్న రవీంద్రారెడ్డి తెలుగుదేశం గూటికి చేరుతారని ఆయన వర్గీయులు కూడా చెబుతున్నారు.
రాయలసీమలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జల్లాలలోనూ వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తే అవకాశాలున్నాయనీ, ఉత్తరాంధ్రలో వాసుపల్లి గణేష్, గోదావరి జిల్లాలలోనూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యక్తమౌతున్న ప్రజాగ్రహాన్ని చూసి ఆ పార్టీ నేతలు తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళనలో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/many-leaders-likely-to-jump-into-tdp-from-ycp-25-137328.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.