జనగామలో ఉద్రిక్తత..సొమ్మసిల్లి పడిన హరీష్‌రావు
Publish Date:Jan 4, 2012
Advertisement
జనగామ: జిల్లాలోని జనగామలో జెఏసి శిబిరాన్ని సందర్శించేందుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావుపై వరంగల్ జిల్లా పోలీసులు బుధవారం మాట జారారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హరీష్ రావు, వినయ్ భాస్కర్, జెఏసి చైర్మన్ కోదండరామ్ శిబిరాన్ని సందర్శించేందుకు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. తమ పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ హరీష్ రావు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని పంపించే ప్రయత్నాలు చేశారు. టిఆర్ఎస్ వర్గాలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. జనగామ సిఐ హరీష్ రావు చొక్కా పట్టుకొని లాగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో హరీష్ రావు సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నలుగురికి గాయాలయ్యాయి. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా పోలీసులకు, తెలంగాణవాదులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో వరంగల్ జిల్లా జనగామ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు హరీష్ రావును, వినయ్ భాస్కర్‌ను అరెస్టు చేశారు. తెలంగాణవాదులపై కేసులు పెడుతూ ప్రభుత్వం ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుందన్నారు.
http://www.teluguone.com/news/content/janagama-24-10610.html





