విజయమ్మకు 'జగనన్నకానుక'

Publish Date:Mar 14, 2022

Advertisement

2009, సెప్టెంబర్ 2, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరెడ్డి ఆకస్మిక మృతి.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలుతో వైయస్ ఫ్యామిలీ ఓదార్పు యాత్ర చేస్తానంటే.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మోకాలడ్డడం... దీంతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. 2011, మార్చి 12న తన తండ్రి పేరుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం.. దీనికి అధ్యక్షుడిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టడం.. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఆయన తల్లి వైయస్ విజయమ్మని కూర్చోబెట్టడం.. ఆ తర్వాత వైయస్ జగన్ ఆక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడం.. జగనన్న వదిలిన బాణమంటూ ఆయన సోదరి వైయస్ షర్మిల జగన్న కోసం పాదయాత్ర చేయడం.. ఆ తర్వాత జగన్ బెయిల్‌పై విడుదల కావడం.. ఆ క్రమంలో జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికలకు జగన్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కావడం.. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను... అధికార తెలుగుదేశం పార్టీ సంతలో పశువులు కొంటున్నట్లు కొంటున్నారంటూ ఆగ్రహించిన ప్రతిపక్ష నేత వైయస్ జగన్.. అసెంబ్లీని బాయికాట్ చేసి మరీ పాదయాత్రకు శ్రీకారం చుట్టడం.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ బంపర్ మేజార్టీ సాధించి.. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ అధికార పీఠం ఎక్కడం ఇదంతా సినిమా రీల్ తిరిగినట్లు అంతా చకచకా జరిగిపోయాయి. 

అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైయస్ జగన్, వైయస్ షర్మిల కొద్దిగా విశ్రాంతి అయినా తీసుకుని ఉండవచ్చు. కానీ  వైయస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మాత్రం ఎక్కడా కంటి మీద కునుకు కూడా తీయలేదంటే అతిశయోక్తి కాదేమో. తన కుమారుడు వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయండి.. అతడికి ఒక్క చాన్స్ ఇవ్వండి..  రాజన్న రాజ్యం తీసుకు వస్తాడంటూ ప్రజలను వేడుకున్నారు. ఇంకా చెప్పాలంటే... ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌ను అధికార పీఠం ఎక్కించేందుకు తల్లిగా వైయస్ విజయమ్మ అయితే ఓ విధంగా పెద్ద యజ్జమే చేశారని ఆ పార్టీలోని దాదాపు ప్రతి ఒక్కరు ఇప్పటికీ గుర్తు చేసుకొంటారు. ఎవరు అవునన్నా కాదన్నా.. వైయస్ జగన్ కోసం వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల పడిన కష్టం అందరికీ తెలిసిందే. కానీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వైయస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మను ఆ పదవి నుంచి తొలగించాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయించారని తెలుస్తోంది. ఈ పదవిలో సీఎం వైయస్ జగన్.. తన సతీమణి వైయస్ భారతీని కూర్చోబెట్టాలని ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారని తాడేపల్లి ప్యాలెస్‌లో అంతర్గతంగా ఓ చర్చ అయితే నడుస్తోంది. మరికొద్దిరోజుల్లో దీనిపై ఓ ప్రకటన అయితే వెలువడనుందని తెలుస్తోంది.  

అయితే వైయస్ విజయమ్మను పార్టీ అధ్యక్షరాల పదవి నుంచి తొలగించడంపై తెలుగు ప్రజల్లోనే కాదు.. ఫ్యాన్ పార్టీలో సైతం ఓ విధమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని సమాచారం. పీకల్లోతు కష్టాల్లో ఉన్న పార్టీకీ వైయస్ విజయమ్మ జీవం పోశారని? బిడ్డ వైయస్ జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె ఊరూరు తిరిగారని.. ఆ క్రమంలో ఆమె ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని... అందులోభాగంగా ఆమె తీవ్ర విమర్శలు సైతం ఎదుర్కొన్నారని .. అయినా వాటికి వైయస్ విజయమ్మ ఎదురొడ్డి నిలవడమే కాకుండా.. వారి విమర్శలకు ఆమె అదరలేదు.. బెదరలేదన్నట్లు వ్యహరించడమేకాకుండా.. కష్టకాలంలో పార్టీకి వెన్ను దన్నుగా వైయస్ విజయమ్మ నిలిచారని ప్రజలంతా గుసగుసలాడుకొంటున్నారు. 

అయితే వైయస్ విజయమ్మే .. ఆ పార్టీ కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నారా? లేక ఆమెను కావాలనే తప్పించారా? అనే ప్రశ్నలు అటు మీడియాలోనే కాదు.. ఇటు సోషల్ మీడియాలో సైతం వెల్లువెత్తాయి. ఈ విషయం ముందే గ్రహించిన వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిలలు పక్క రాష్ట్రానికి వచ్చేసి పార్టీ పెట్టుకున్నారనే టాక్ కూడా అదే రేంజ్‌లో నడుస్తోంది. కన్న తల్లి వైయస్ విజయమ్మ పట్ల వైయస్ జగన్ ఇలా వ్యవహరించడం పట్ల .. ప్రజల్లో ఓ విధమైన సంకేతాలు వెళతాయని.. ఫ్యాన్ పార్టీలోని కీలక నేతలు సైతం పేర్కొనడం గమనార్హం. ఈ కారణంగానే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఎక్కడ ఎటువంటి హాడావుడి లేకుండాపోయిందనే చర్చ కూడా నడుస్తోంది. పార్టీ స్థాపించి ఈ ఏడాదికి 11 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో పార్టీలో వేడుకలు లేవు.. కేడర్ లో ఊపు లేదు... లీడర్‌లో ఉత్సాహం లేదనే టాక్ అయితే రచ్చ రచ్చగా వైరల్ అవుతోంది. పార్టీ ప్రతిపక్షంలోనే ఉన్నప్పుడు.. కేడర్ నుంచి లీడర్ వరకు అందరిలో సంతోషం, హడావుడులు ఉండేవని కానీ నేడు ఆవి మాత్రం మచ్చుకైనా ఎక్కడ కనిపించడం లేదనే అభిప్రాయం ఫ్యాన్ పార్టీలోనే వ్యక్తమవుతోంది.
 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.