తెలంగాణపై దండయాత్రకు బీజేపీ బృందం?

Publish Date:Mar 14, 2022

Advertisement

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా శాసనభసభల్లో ఘన విజయాలు సాధించిన జోష్ లో భారతీయ జనతా పార్టీ ఉంది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించే ఈ ఎన్నికలతో తనకు తిరుగేలేదని బీజేపీ నిరూపించుకుంది. ఉత్తరాదిలో బలీయంగా ఉన్న బీజేపీ దక్షిణ భారతదేశంలో కూడా తన ఉనికిని చాటుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో కూడా పాగా వేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని బీజేపీ అధిష్టానం ప్రణాళికలు వేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణకు సొంత వ్యూహకర్తల బృందాన్ని తెలంగాణ రాష్ట్రానికి పంపించాలని నిర్ణయించిందట. ఈ పోల్ స్ట్రాటజీ బృందం కూడా మార్చి నెలాఖరులో తెలంగాణలో కాలుపెట్టి, పని మొదలుపెడుతుందని ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

2023 ఆఖరిలో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మొన్నటి యూపీ ఎన్నికల విజయంతో దూకుడుమీద ఉన్న బీజేపీ.. తెలంగాణ ఎన్నికలపైనా దృష్టి పెట్టనుందట. తెలంగాణలో బీజేపీని గెలుపు దిశగా అడుగులు వేయించేందుకు, అధికార పగ్గాలు చేపట్టేందుకు వ్యూహాలను అమలు చేయాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించిందట. అందు కోసమే సొంతంగా ఎన్నికల నిపుణులను రంగంలోకి దింపాలని డిసైడ్ అయిందంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి విజయం చేకూర్చిపెట్టిన సొంత వ్యూహకర్తల బృందాన్నే తెలంగాణకు కూడా పంపిస్తోందట. కేంద్రంలోని బీజేపీ పైనా, ప్రధాని మోడీపైన ప్రత్యక్షంగా ఆరోపణలు, విమర్శలతో దాడి చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కొమ్ములు వంచాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయిందంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడం, అధికారానికి కావాల్సిన అసెంబ్లీ స్థానాలు చేజిక్కించుకోవడం, తద్వారా దక్షిణాదినా తన ఉనికిని ప్రదర్శించుకోవడం అనే లక్ష్యాలతో బీజేపీ ముందుకు సాగుతోందంటున్నారు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ పైనా, ఆయన నిర్ణయాలపైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒంటికాలిపై లేస్తున్నారు. మరో పక్కన సమయం చిక్కినప్పుడల్లా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తూర్పారపడుతూనే ఉన్నారు. తెలంగాణలో పాగా వేయడం ద్వారా గత సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు లోక్ సభాస్థానాలకు తోడు వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచి, తమ పట్టు నిలుపుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోందట.

గత ఎన్నికల్లో హైదరాబాద్ లోని గోషామహల్ అసెంబ్లీ సీటు ఒక్కటే గెలిచిన బీజేపీ అనంతరం జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గణనీయమైన సంఖ్యలో కార్పొరేటర్లను గెలిపించుకుని మరింత హుషారుగా ఉంది. ఆ తర్వాత ఇటీవలే జరిగిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గెలుపుతో మరో ముందడుగు వేసింది. ఇదే జోష్ ను రాబోయే ఎన్నికల్లో కూడా కొనసాగించాలని, కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు చెక్ పెట్టడంతో పాటు అధికారం చేజిక్కించుకోవాలనే కృతనిశ్చయంతో బీజేపీ అధిష్టానం ఉందని చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ మినహా ప్రత్యామ్నాయం అంటూ ప్రయత్నాలు ముమ్మరం చేయడం, బీజేపీని, ప్రధాని మోడీని ఇష్టం వచ్చినట్లు విమర్శించడం కూడా బీజేపీ అధిష్టానం అస్సలు సహించడం లేదంటున్నారు. ఒక పక్కన ప్రత్యామ్నాయం అంటూ వివిధ రాష్ట్రాల్లో టూర్లు చేసి, బీజేపీ యేతర నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. మరో పక్కన ఇటీవల ముచ్చింతల్ జరిగిన ‘సమతా మూర్తి’ రామానుచార్యుల విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు తనను ఆహ్వానించకుండా సాకు చెప్పి గైర్హాజర్ అయిన కేసీఆర్ ను మోడీని గుర్తుపెట్టుకున్నారంటున్నారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవుల్లోని వ్యక్తులు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతించకుండా కేసీఆర్ ముఖం చాటు వేయడాన్ని మోడీ, అమిత్ షా ద్వయం ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. ఎలాగైనా కేసీఆర్ అహాన్ని అణచాలనే సమయం కోసం వారు ఎదురు చూస్తున్నారంటున్నారు.

కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు, కేంద్ర ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణల కారణంగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దొరకలేదంటున్నారు. రెండు రోజులు ఢిల్లీలోనే మకాం వేసినా కేసీఆర్ కు ప్రధాని మోడీ దర్శనం దక్కలేదంటున్నారు.

కంటోన్మెంట్ కు కరెంట్, నీళ్లు కట్ చేస్తామంటూ తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నేరుగా హెచ్చరికలకు దిగడం బీజేపీ అధిష్టానం వ్యూహంలో భాగమే కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అసలే కేసీఆర్ అంటే తోక తొక్కిన నాగుపాములా లేచే బండి సంజయ్ ‘కంటోన్మెంట్ కు కరెంట్, నీళ్లు కట్ చేసి చూడు.. ఏమవుతుందో చూపిస్తామం’టూ గట్టిగానే వర్నింగ్ ఇవ్వడం విశేషం. అంతకు ముందు పాతయాత్రల సందర్భంగా కూడా బండి సంజయ్ సీఎం కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ పైనా విమర్శలతో విరుచుకుపడుతూనే ఉన్నారు.

ఇప్పుడు ఏకంగా యూపీలో బీజేపీని విజయపథం వైపు నడిపించిన పోల్ స్ట్రాటజీ టీమ్ నే ఆ పార్టీ అధిష్టానం తెలంగాణలో దింపుతుండడాన్ని చూస్తుంటే.. కేసీఆర్ అధికారానికి, టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డట్టే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి 60 మందితో కూడి పోల్ స్ట్రాటజీ బృందం తెలంగాణలో అడుగుపెడుతోందట. ఆ బృందం ఆ వెంటనే పోల్ మేనేజ్ మెంట్ పని మొదలుపెడుతుందని బీజేపీ వర్గాల వారు చెబుతుండడం విశేషం.

కాగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ట్ సేవల్ని కేసీఆర్ తీసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటికి రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారం అనుభిస్తోంది. ఈ క్రమంలో తమ ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతను అధిగమించాలని, మూడోసారి కూడా గెలిచి, హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంలో పీకే బృందాన్ని నియమించుకుంది. అయితే.. బీజేపీ తన సొంత పోల్ స్ట్రాటజీ బృందాన్ని తెలంగాణలో దించుతోంది. వచ్చే ఎన్నికల్లో పీకే వ్యూహాలు ఫలిస్తాయా..? లేక బీజేపీ స్ట్రాటజీ బృందం ప్రణాళికలు గెలుపు తెచ్చిపెడతాయా? టీఆర్ఎస్ విజయం సాధిస్తుందా? లేదంటే బీజేపీయే చరిత్రాత్మక విజయం సాధించి, దక్షిణాది రాష్ట్రం తెలంగాణలో అధికారం చెలాయిస్తుందా? భవిష్యత్తే తేల్చనుంది.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.