కేటీఆర్ వ‌ర్సెస్ సైన్యం.. రాజకీయ దుమారం

Publish Date:Mar 14, 2022

Advertisement

అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే ఏమవుతుంది? అందులో ఉన్న పాలో, పెరుగో నేల పాలవుతుంది. అయితే, ఎందుకనో గానీ, తెరాస నాయకులు, చివరకు కేసీఆర్, కేటీఆర్’ కూడా కేంద్రం పుట్టలో వేలు పెడుతున్నారు. బీజీపీ మీద పెరుగుతున్న కోపతాపాలను, సైన్యం మీద చూపించి విమర్శలు కొని తెచ్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి కేసేఆర్, సరిహద్దులో చైనా సేనలను నిరోధించడంలో మన సైన్యం విఫలమైందనే అర్ధం వచ్చేలా, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విమర్శలు ఎదుర్కున్నారు. అలాగే సర్జికల్ స్ట్రైక్స్’ విషయంలోస్ట్రైక్స్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్ధించి మరోమారు, విమర్శలు ఎదుర్కున్నారు. 

అదలా ఉంటే ఇప్పుడు కేటీఆర్, కంటోన్మెంట్ ఏరియాకు కరెంట్, నీళ్లు ఆపేస్తామని హెచ్చరించారు. అదికూడా అసెంబ్లీ సాక్షిగా,కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టే క్రమంలో సైన్యం పైనా ప్రత్యక్ష విమర్శలు చేశారు.  కంటోన్మెంట్ ఏరియాలో ఇష్టమొచ్చినట్టుగా రోడ్లు మూసివేస్తే ఊరుకోమని, ప్రజల కోసం తాము ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు. కంటోన్మెంట్ ఏరియాలో నాలాలపై చెక్ డ్యాములు కట్టడంవల్ల కాలనీలు మునిగిపోతున్నాయని,  ఎన్నిసార్లు చెప్పినా అక్కడ అధికారుల తీరు మార్చుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల కోసం తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే కంటోన్మెంట్ కు నీళ్లు, కరెంటు కట్ చేస్తామని కేటీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులతో ఆఖరుసారి చర్చలు జరపాలని వినకపోతే నీళ్లు, కరెంటు కట్ చేయాలని అసెంబ్లీలోనే ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీకి మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చారు.

కేటీఆర్ చేసిన హెచ్చరిక పట్ల ఇటు రాజకీయ ప్రత్యర్ధుల నుంచే కాకుండా, సామాన్య ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. తప్పయినా, ఒప్పయినా సైన్యాన్ని చులకనచేసి మాట్లడితే, సామాన్యులు కూడా సమర్ధించరు. అలాంటిది మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సైన్యానికి హెచ్చరికలు జారీ చేయడాన్ని, సామాన్య ప్రజలు కూడా సైన్యాన్ని అవమానించడంగానే చూస్తున్నారు. అదే సమయంలో  ఓల్డ్ సిటీ’లో విద్యుత్ చార్జీలు వసూలు చేయడం చేతగాని, ప్రభుత్వం కంటోన్మెంట్ కరెంట్, వాటర్ సప్లై ఆపేస్తామని హెచ్చరించడం రాజకీయంగానూ వివదాస్పదం అయింది. మరో వంక కేంద్ర రక్షణ శాఖ కూడా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్’గా తీసుకున్నట్లు తెలిస్తోంది. 

మరోవంక రాష్ట్ర బీజేపే నాయకులు కూడా కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారారు.  బీజేపీ నాయకత్వం రాజకీయంగా ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే, ముఖ్యమంత్రి కేసేఆర్ చైనా సరిహద్దులో మన సైన్యం విఫలమైందని చేసిన వ్యాఖ్యలు, సర్జికల్ స్ట్రైక్స్’పై అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా సైన్యాన్ని అవమానించారని ఆరోపిస్తున్న బీజేపీకి కేటీఆర్ మరో అస్త్రాన్ని అందించారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

ఆలాగే, గతంలో ఎప్పుడో ఎంపీగా ఉన్నరోజుల్లో కేసీఆర్ కుమార్తె, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఒక ఇంటర్వ్యూలో, “జమ్ము కశ్మీర్, తెలగాణ భారత దేశంలో అంతర్భాగం కాదు” అంటూ చెప్పినట్లు వచ్చిన వార్తలపై దుమారమే చెలరేగింది. ఇందుకు సంబంధించి  బీజేపే లీగల్ సెల్  కన్వీనర్ కే. కృష్ణ సాగర్, స్థానిక కోర్టులో వేసిన పిటీషన్’ పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. చివరకు కవిత క్షమాపణలు కూడా చెప్పి నట్లు గుర్తు. ఒక విధంగా చూస్తే తెరాస అగ్ర నేతలు బీజేపీ ఎక్కడ కెలక కూడదో అక్కడ కెలికి అనవసర సమస్యలు సృష్టించు కుంటున్నారని తెరాస నాయకులే, అంటున్నారు.
 

By
en-us Political News

  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.