ఏపీలో జగన్ వర్సెస్ షర్మిల?

Publish Date:Jul 5, 2023

Advertisement

దివంగత వైఎస్సార్ తనయ.. ఏపీ సీఎం జగన్ సోదరి.. షర్మిల.. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం.. ఇప్పుడు ఆమె జగనన్నపై కాంగ్రెస్ సంధించిన అస్త్రం కాబోతోందా? వైసీపీ అధినేత జగన్  జైలులో ఉండగా, పాదయాత్ర చేసిన ఆయన సోదరి షర్మిల అప్పట్లో ప్రతి ప్రసంగంలోనూ తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకునే వారు. ఆ తరువాత.. అంటే జగన్ ఏపీ సీఎం అయిన తరువాత  జగన్ ఆ బాణాన్ని పక్కన పెట్టేశారు.

అవసరమే లేదన్నట్లుగా వదిలేశారు. పార్టీలో ఇసుమంతైనా ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఆమె స్వయంగా పార్టీనీ, రాష్ట్రాన్నీ వీడి పొరుగు రాష్ట్రంలో సొంత కుంపటి పెట్టుకుని రాజకీయాలు చేసుకునే విధంగా తరిమేశారు. సొంత పార్టీని నడిపేందుకు ఆమె ఇబ్బందులు పడుతున్నా ఇసుమంతైనా సహాయం చేయలేదు. దీంతో ఇరువురి మధ్యా పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఆ పరిస్థితినే ఇప్పుడు కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. జగన్ వైసీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ పార్టీ వైఎస్ బ్రాండ్ ను కోల్పోయింది. ఇప్పుడు షర్మిలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా జగన్ నుంచి ఆ బ్రాండ్ ను  లాగేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.  ఏపీలో  నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చి, కొత్త ఊపిరులూదేందుకు షర్మిల కాంగ్రెస్ కు ఒక ఆయుధంగా కనిపిస్తున్నది.  

దివంగత మహానేత వైఎస్‌ ముద్దుల బిడ్డ, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు, రంగం దాదాపు  సిద్ధమైపోయిందనే అంటున్నారు.  ఇందుకు సంబంధించిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయనీ, షర్మిల కోరినట్లుగా ఆమె తెలంగాణలో పార్టీకి సేవలు అందించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించలేదు. ఆమె ఏపీలోనే పార్టీకి సేవలందించాలని కాంగ్రెస్ విస్పష్టంగా చెప్పేసింది. అవసరమైతే ఏపీ పీసీసీ చీఫ్ గా ఆమెను నియమించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పేసింది. ఇందుకు ఆమె తొలుత ముందు వెనుకలాడినా.. చివరకు అంగీకరించినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమనీ, అయితే ఎప్పుడు ఎవరి సమక్షంలో చేరుతారన్నదే ఖరారు కావాల్సి ఉందని అంటున్నారు.  

వైఎస్‌ ఆత్మ, ఆ కుటుంబంతో విడదీయలేని బంధం ఉన్న కెవిపి రామచంద్రరావు కూడా.. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతుందన్న సమాచారం ఉందని చెప్పడాన్ని బట్టి షర్మిల కాంగ్రెస్ లో చేరిక లాంఛనమేననీ, ఇడుపుల పాయలో సోనియా, రాహుల్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు.   షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతమౌతుందని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది.  ఆమె రాక వైసీపీని  గట్టిగా దెబ్బతీస్తుందని  కాంగ్రెస్‌ సీనియర్లు నమ్ముతున్నారు.  అన్నిటికీ మించి వైసీపీ అధినేత, సీఎం జగన్ కు  షర్మిల రాక శరాఘాతం కాకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత  జిల్లా కడపలో జగన్‌కు సరిసమానమైన ఆదరణ షర్మిలకు ఉందని చెబుతున్నారు. ఆమె రాకతో ఏపీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతాయని అంచనా వేస్తున్నారు.  

By
en-us Political News

  
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.