స్పీడ్ న్యూస్ -1

Publish Date:Jul 5, 2023

Advertisement

1.తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు-సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భేటీపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భరతం పట్టేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని, ఈ నేపథ్యంలో కూటమిలో చీలిక తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

2.ఢిల్లీలో జరుగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. 

3.సోషల్ మీడియాలో ఎవరికి వారే పోస్టులు పెడుతున్నారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మద్దతుగా బీజేపీ క్యాడర్ పోస్టులు పెడుతోంది. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించటాన్ని ఈ వర్గం తప్పు పడుతోంది.ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి రావటంతో.. సోషల్ మీడియాలో ఈటల వర్గం సంబరాలు చేసుకుంటోంది. కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్గం మాత్రం సైలెంట్‌గా ఉంది.

4. ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్‌పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ  సెటైర్ విసిరారు. విజయవాడలో నేడు  రాష్ట్ర     మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హాస్య ప్రదర్శన... ప్రవేశం ఉచితం... ఆసక్తి కలిగిన వారు తిలకించవచ్చు అంటూ ఎద్దేవా చేశారు.  

5.తెలంగాణలో త్వరలోనే గ్రూప్‌4 పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

6.  అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్‌ను మార్చి కిషన్‌రెడ్డిని నియమించడం పట్ల టీపీసీసీ అలర్ట్‌ అయింది. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కోరిక మేరకే కిషన్‌రెడ్డిని నియమించారని ఆరోపిస్తూనే బీసీ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. 

7. నాలుగేళ్ల పాటు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించి విసిగిపోయాను’అని కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కేసీఆర్‌ తీరుపై విమర్శలు గుప్పించారు. 

8.మహారాష్ట్రలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవవార్‌తోపాటు బీజేపీలోకి ఫిరాయించిన ఆయన సోదరుడి కుమారుడు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గం బుధవారం పోటాపోటీగా వేర్వేరుగా సమావేశం అవుతోంది. శరద్ పవర్ వర్గం దక్షిణ ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం అయ్యింది. అజిత్ వర్గం బాంద్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో  ఉదయం 11 గంటలకు సమావేశం అయ్యింది. 

9.పెళ్లి వేడుకలో వధువు తల్లి సిగరెట్ కాల్చడం చూసిన వరుడు తనకు పెళ్లి వద్దంటూ మొండికేశాడు. వివాహ వేదిక నుంచి వెళ్లిపోయాడు. యూపీలోని సంభాల్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

10.దురదృష్టమంటే జింబాబ్వేదే. ప్రపంచకప్‌లో చోటు ఖాయమని భావించిన వేళ చివరి మెట్టుపై ఓ అనామక జట్టుపై పరాజయం పాలై అనూహ్యంగా ప్రపంచకప్‌కు దూరమైంది. క్వాలిఫయర్స్‌లో చితక్కొట్టేస్తున్న స్కాట్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్ ఇప్పటికే నిష్క్రమించగా ఇప్పుడు  జింబాబ్వేలోని బులవాయోలో జరిగిన  మ్యాచ్‌లో వరుసగా రెండోసారి కూడా దూరమైంది. ఏమాత్రం ఊహించని ఈ పరిణామంతో జింబాబ్వే ఆటగాళ్లు కంటతడి పెట్టుకున్నారు. 

By
en-us Political News

  
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.