పెళ్లి కాని ప్రసాదులకు పెన్షన్!

Publish Date:Jul 5, 2023

Advertisement

పిల్ల దొరక్క పెళ్లి ఈడు దాటిపోయి... ఒంటరిగా మిగిలిపోయి.. దిగులు పడుతున్న పెళ్లి కాని ప్రసాదులకు హార్యానా ప్రభుత్వం  జిలేబీ లాంటి తీపి కబురు చెప్పింది.  బెండకాయ ముదిరినట్లు ముదిరిపోయిన ఒంటరి మగవారికి ఇకపై ప్రతీ నెల పెన్షన్ ఇచ్చే పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల వయస్సు గల పురుషులు ఈ పథకానికి అర్హులని ఆయన చెప్పారు. ఈ పథకం ద్వారా  రాష్ట్రంలో ఉన్న దాదాపు 2 లక్షల మంది పెళ్లి కాని ప్రసాదులకు లబ్ది చేకూరుతుంది

కర్నల్ జిల్లాలో కమలాపూర్ గ్రామంలో ఇటీవల నిర్వహించిన జన్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా.. 60 ఏళ్ల వయస్సు ఉండి వివాహ యోగానికి నోచుకోని పురుషులకు పెన్షన్‌ అంశంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ముఖ్యమంత్రి కట్టర్‌ సానుకూలంగా స్పందించారు.  

అయితే ఇదే కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్‌కు ఇస్తున్న పెన్షన్ మరో 250 రూపాయిలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో  సీనియర్ సిటిజన్ల పెన్షన్  3 వేల రూపాయిలకు పెరుగుతుంది.

పెళ్లి కాని ప్రసాదుల కోసం ప్రభుత్వం త్వరలో అందజేయనున్న ఈ పెన్షన్ ఎంత అనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న పెన్షనే.. వీరికీ ఇవ్వాలన్న అభిప్రాయంతో సీఎం ఉన్నట్లు   ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై త్వరలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు 2024లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదీకాక రాష్ట్రంలో మగవారి సంఖ్య  పెరుగుతోంది అయితే  ఆ నిష్పత్తిలో ఆడవారి సంఖ్య పెరగడం లేదు. దీంతో మగవారిలో అవివాహితులుగా మిగిలిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

ఇంకోవైపు దేశంలో భూణ హత్యల జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో హర్యానా కూడా  ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిందనే ప్రచారం నడుస్తోంది.  

అయితే రాష్ట్రంలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో.. హిమాచల్‌ప్రదేశ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ మహిళలను బలవంతంగా హర్యానా పురుషులు వివాహం చేసుకున్నారు. అలా  ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 1.35 లక్షల మంది మహిళలను.. హర్యానా పురుషులు వివాహం చేసుకొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆడపిల్ల సంఖ్యను పెంచే క్రమంలో.. ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే.. ఆ విషయంలో ప్రభుత్వ పెద్దలకే ఓ స్పష్టత లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

By
en-us Political News

  
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.