తాడేపల్లి.. బెంగళూరు ప్యాలెస్ ల మధ్య జగన్ షటిల్ సర్వీస్.. ప్రయోజనమేంటి?

Publish Date:Aug 7, 2024

Advertisement

వైసీపీ ఘోర ఓటమి తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఒక్క రోజు స్థిమితంగా గడపలేకపోతున్నారు. ఓటమి తరువాత ఆయన తాడేపల్లి టూ బెంగళూర్ డైలీ సర్వీస్ చేస్తున్నట్లుగా ఆయన పర్యటనలు ఉన్నాయి.తెలుగుదేశం వాళ్లు వైసీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడు తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదు. కూటమి సర్కార్ ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ గగ్గోలు పెట్టడం. అలా పెడుతూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు, బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు షటిల్ సర్వీస్ చేయడం వినా జగన్ మోహన్ రెడ్డి  అధికారం కోల్పోయిన తరువాత ఈ రెండు నెలలలో చేసిందేమీ లేదు. మధ్యలో ఒక సారి హస్తిన వెళ్లి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ఖితిపై ధర్నా చేసి నవ్వుల పాలయ్యారు. ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లడానికి కారణమేమిటన్నది చెప్పకపోయినా, బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చేందుకు మాత్రం కారణం చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా చిన్న పాటి హింసాఘటన జరిగితే.. ఆ ఘటన వెనుక ఉన్న కారణంతో సంబంధం లేకుండా దానికి రాజకీయం ఆపాదించి, వైసీపీ శ్రేణులపై తెలుగుదేశం దాడులు అంటూ హడావుడి చేయడానికే ఆయన బెంగళూరు ప్యాలెస్ వీడి యబటకు వస్తున్నారు.  ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత  ఈ రెండు నెలలో జగన్ నాలుగుసార్లు బెంగళూర్  తాడేపల్లి ప్యాలస్ ల మధ్య  షటిల్ సర్వీస్ చేశారు.  రాష్ట్రంలో ఎదో జరిగిపోతుంది, తనకు తన పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేదు అంటూ కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీయడమే లక్ష్యం అని చాటుకుంటున్నారు. 

బాబాయ్ గొడ్డలి పోటును గుండె పాటుగా చిత్రీకరించి  గత ఎన్నికలలో సానుభూతిని సంపాదించుకుని గద్దెనెక్కిన జగన్.. ఇప్పుడు కూడా అదే సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో సాగిన దౌర్జన్య, హింసాకాండలను ప్రత్యక్షంగా చూసిన, అనుభవించిన జనం ఆయన ఓదార్పు, పరామర్శ యాత్రలను లైట్ తీసుకుంటున్నారు. 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ 36 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారంటూ గుండెలు బాదుకుంటున్న జగన్, ఆ హతుల వివరాలు బయటపెట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదు.  వ్యక్తిగత కక్ష్యలను రాజకీయ హత్యలుగా, కుటుంబ గొడవలను పార్టీ గొడవలుగా చిత్రీకరించి  రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారు.  

జగన్ ఈ వైఖరి వైసీపీ నేతలలో అసంతృప్తికి కారణం అవుతోంది. కేతిరెడ్డి వంటి వారు బాహాటంగానే కూటమి ప్రభుత్వానికి నిలదొక్కుకోవడానిక సమయం ఇవ్వాలి, ఆ తరువాతే విమర్శలు అంటూ జగన్ కు బాహాటంగానే సూచిస్తున్నారు. పార్టీ సీనియర్లంతా సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు.  ఈ పరిస్థితుల్లో జగన్ బెంగళూరు, తాడేపల్లి మధ్య షటిల్ సర్వీసులను,  శాంతి భద్రతల పరిస్థితిపై చేపడుతున్న ఆందోళన, పరామర్శ, సంతాప యాత్రలను ఆ పార్టీలోనే ఎవరూ పట్టించుకోవడం లేదు. నెటిజనులు జగన్ హడావుడిపై ఓ లెవల్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. అయితే తాను చెప్పడమే తప్ప వినే  అలవాటు లేని జగన్ వాస్తవాలను గుర్తించకుండా చేస్తున్న హడావుడి వల్ల ఆయనకు కానీ, ఆయన పార్టీకి కానీ ఇసుమంతైనా ప్రయోజనం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.