ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పరిస్థితిపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఒక్క మాట అన్నందుకే జగన్ కేబినెట్ ఉలిక్కి పడింది. ఏపీలో కరెంటు కోతలే లేవంటూ అడ్డంగా కోతలు కోసేసింది. మా రాష్ట్రానికి వస్తే విద్యుత్ వెలుగులతో రాష్ట్రం ఎలా వెలిగిపోతోందో చూపిస్తామంటూ సవాళ్లు విసిరింది.
తెలంగాణలో సింగరేణి ఉంది కనుక మీకు విద్యుత్ ఇబ్బందులు తలెత్తలేదనీ. ఏపీలో సింగరేణి లేకపోయినా..ఖర్చు ఎంతైనా భరించి బొగ్గు కొనుగోలు చేసి మరీ విద్యుత్ సరఫరా చేస్తున్నామనీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించేశారు. మరో మంత్రి బొత్స ఒక అడుగు ముందుకు వేసి ఏపీలో కరెంటు కోతలా, నిజానికి హైదరాబాద్ లోనే కరెంటు పరిస్థితి అధ్వానంగా ఉందని ఎదురు ఆరోపణ చేశారు. అక్కడితో ఆగకుండా, తెలంగాణలో కరెంటు కోతల గురించి నా కెవరూ చెప్పలేదనీ, తానే స్వయంగా అనుభవించాననీ ముక్తాయించారు. ఆ మధ్య హైదరాబాద్ లో ఒక రోజు ఉన్నాననీ, కరెంటు లేక జనరేటర్ పెట్టుకోవలసి వచ్చిందనీ నమ్మ బలికారు. అయితే బొత్స చెప్పినా, పెద్దరెడ్డి బుకాయించినా, రోజా సవాళ్లు విసిరినా ఏపీలో వాస్తవ పరిస్థితి జనానికి తెలియంది కాదు.
ఇక మంత్రి కాకాణి సచివాలంయలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనే విద్యుత్ కట్ అయ్యింది. కోతలు లేరి రాష్ట్రం అంటూ మంత్రులు కోసిన కోతల బండారం ఈ సంఘటనతో బయటపడింది. ఐరాస నేతృత్వంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఒ) అవార్డుకు ఆర్బీకేలు నామినేట్ అయ్యాయని ఘనంగా చాటేందుకు వ్యవసాయ మంత్రి కాకాణి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనే విద్యుత్ కట్ అయ్యి ప్రభుత్వ బండారాన్ని బట్టబయలు చేసింది.
కోతలు లేని రాష్ట్రం అంటూ జగన్ సేన చేసిన బుకాయింపుల బాగోతం ఈ ఒక్క సంఘటనతో బట్టబయలైంది. వాస్తవాన్ని అంగీకరించకుండా, జనం బాధల పట్టింపు లేకుండా బుకాయింపులై ఆధారపడితే బొక్కబోర్లా పడక తప్పదని కాకాణి మీడియా సమావేశంలో విద్యుత్ కోత అనుభవంలోనికి తెచ్చింది.
విద్యుత్ విధానంలో జగన్ సర్కార్ అస్తవ్యస్థ విధానాల కారణంగానే ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ స్థితి నుంచి అంధకారంలో కూరుకుపోయిన పరిస్థితి వచ్చింది. ఒప్పందాల సవరణ వద్దని నెత్తీ నోరూ బాదుకున్నా జగన్ వినని ఫలితమే ఇదని విద్యుత్ రంగ నిపుణులు ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. ఇప్పటికైనా వట్టి మాటలు కట్టిపెట్టి విద్యుత్ పరిస్థితిని చక్కదిద్దే చర్యలు తీసుకోవాలని జగన్ కు హితవు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-sarkar-lies-on-powercuts-25-135451.html
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.