ఉత్తరాంధ్రలో బాబుకు బ్రహ్మరథం.. జగన్ కు చుక్కలే!

Publish Date:May 5, 2022

Advertisement

త్తరాంధ్రలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పట్టారు. బాదుడే బాదుడు నిరసనలో పాల్లొనేందుకు శ్రీకాకుళం జిల్లా దళ్లవలసకు వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయంలో దిగింది మొదలు చంద్రబాబుకు జనం నీరాజనం పలికారు. సీఎం..సీఎం అంటూ నినాదాలు చేయడం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో సర్కార్ లేదన్న తమ భావనను ఎలుగెత్తారు. గత ఎన్నికలలో ఎక్కడైతే జగన్ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పని చేసిందో అక్కడే జగన్ కు జనం నీరాజనం పలకడం గమనార్హం. ఈ పర్యటనలో బాబుకు దక్కిన ఘనస్వాగతం చూస్తే..జగన్ కు చుక్కలు కనిపించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
స్వతహాగా తెలుగుదేశంకు గట్టి పట్టున్న  ఉత్తరాంధ్రలో గత ఎన్నికలలో జగన్ హవా వీచింది. ఒక్క చాన్స్ అంటూ జనంలోకి వచ్చిన జగన్ ను అప్పుడు జనం విశ్వసించారు. అయితే మూడేళ్ల పాలన అనంతరం సీన్ రివర్స్ అయ్యింది. ఆ విషయం బాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రస్ఫుటంగా కనిపించింది. బాబు రాకతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.
ఇక దళ్ల వలసలో బాదుడే బాదుడు నిరసన సభలో చంద్ర బాబు ప్రసంగానికి అడుగడుగునా స్పందన కనిపించింది. 

వైసీపీ స‌ర్కారు పెంచిన విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల‌ను నిర‌సిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ద‌ళ్ల‌వ‌ల‌స‌లో బుధ‌వారం రాత్రి జ‌రిగిన  నిర‌స‌న‌లో  నారా చంద్ర‌బాబునాయుడు  ప్రసంగించారు.  జ‌గ‌న్ పాల‌న వ‌ల్ల రాష్ట్రం మ‌రో శ్రీలంక అవ‌డం ఖాయ‌మంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఇప్పుడు జనం పశ్చాత్తాపపడుతున్నారి చంద్రబాబు చెప్పారు.  అధికార బలం, అహంకారంతో జగన్ విర్రవీగుతున్నారని చంద్రబాబు తూర్పారపట్టారు. త‌న ఇంటిపై దాడి చేసిన వైసీపీ నేత‌లు.. అసెంబ్లీలోనే త‌న‌ను అవ‌మాన‌ప‌ర‌చార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు త‌న కుటుంబ స‌భ్యుల‌ను కూడా అవ‌మాన‌ప‌ర‌చార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.   క‌రోనా కంటే కూడా జగన్ డేంజర్ అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రసంగానికి జనంలో మంచి స్పందన కనిపించింది. రాష్ట్రంలో నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను భారీగా పెంచార‌ని, విద్యుత్ ఉండ‌దు గానీ బిల్లులు మాత్రం బాదుడే బాదుడు మాదిరిగా ఉన్నాయ‌న్న ఆయన ఆరోపణలకు జనం నుంచి మంచి స్పందన లభించింది.

జ‌గ‌న్ మాదిరిగా తాను దోచుకోనూలేదు, దాచుకోనూ లేద‌ని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తం మీద  చంద్రబాబు బాదుడే బాదుడు నిరసన సభ విజయవంతం కావడం పట్ల తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. బాబు సభకు జన స్పందన చూస్తే తెలుగుదేశం దూకుడు జగన్ పార్టీనీ, ప్రభుత్వాన్నీ బెంబేతెత్తించడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.