అంబటి రాంబాబు పదవి పీకేసిన జగన్.. సత్తెనపల్లి ఇన్ చార్జ్ గా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి

Publish Date:Jan 10, 2025

Advertisement

అంబటి రాంబాబును వైసీపీ వదిల్చేసుకుంటోందా? ఆయన సొంత నియోజకవర్గం సత్తెన పల్లి ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి అంబటిని తప్పించడం ద్వారా ఆయనకు తన స్థానం ఏమిటో చూపిందా? అంటే వైసీపీ శ్రేణులే ఔనని అంటున్నాయి. అయినదానికీ కాని దానికీ ప్రత్యర్థి పార్టీల నేతలపై మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులపై అనుచిత వ్యాఖ్యలతో, అసంబద్ధ విమర్శలతో విరుచుకుపడిపోయే అంబటి రాంబాబు ఇక  సత్తెన పల్లి నియోజకవర్గ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత విస్పష్టంగా చెప్పేశారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 

ఉరుములేని పిడుగులా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం సత్తెన పల్లి నియోజకవర్గ  సమన్వయకర్తగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించినట్లుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని  ఆ ఉత్తర్తులలో పార్టీ  కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఈ ఉత్తర్వుల ద్వారా అంబటికి ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో పని లేనట్టేనని జగన్ చెప్పకనే చెప్పేశారని అంటున్నారు.

కంటి తుడుపు చర్యగా ఆయనకు పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తే ఇవ్వచ్చు కానీ, చెప్పా పెట్టకుండా నియోజకవర్గ సమన్వయకర్త పోస్టు పీకేయడం అంటే అంబటికి అవమానమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ అవమానాన్ని దిగమింగుకుని అంబటి పార్టీ తరఫున విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ తన నోటి దూల తీర్చుకోవాలనుకుంటే తీర్చుకోవచ్చు. ఆయన మాట్లాడకపోయినా పార్టీ పట్టించుకోదు.  

By
en-us Political News

  
తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ  ఎన్నికలకు సంబంధించి  బిజెపి అభ్యర్థులను ప్రకటించింది.  రెండు ఉపాధ్యాయ  ఒక పట్టభధ్ర ఎన్నికకు సంబంధించి  అభ్యర్థులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన పోక్సో కేసును క్వాష్ చేయాలంటూ చెవిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం (జనవరి 10) తొసిపుచ్చింది.
కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలిన వైసీపీకి ఇప్పుడు రాజకీయంగా అత్యంత సంక్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ కోసం పని చేయడానికి సీనియర్లెవరూ పెద్దగా సుముఖత చూపడం లేదు. కొత్తవారెవరూ కనీసం పార్టీ వైపు దృష్టి పెట్టడం లేదు. ఆ పార్టీ కార్యక్రమాలన్నీ పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైపోయిన పరిస్థితి ఉంది.
తప్పొప్పులకు బాధ్యత ఎవరిది అన్న విషయాన్ని పక్కన పెడితే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఎంత కాదనుకున్నా ప్రభుత్వ ప్రతిష్ఠను ఒకింత మసకబార్చింది. కూటమి పార్టీలలో కూడా తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎవరి వాదన వారిదన్నట్లుగా కనిపిస్తోంది.
ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం గంటగంటకు మారుతుంది. నిన్న దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ కేసులో ఎవన్ నిందితుడైన కెటీఆర్ ను    ఎసిబి విచారణ చేసింది. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఎసిబి విచారించింది.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణకు శుక్రవారం (జనవరి 10) హాజరయ్యారు. రేసు జరిగిన సమయంలో ఆయన హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ గా ఉన్నారు.
మాజీ ఎంపీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి హైకోర్టులో చుక్కెదురైంది.
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు చెల రేగిపోతున్నారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావులో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరినట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. గురువారం (జనవరి 9) దాదాపు ఏడుగంటల పాటు ఏసీబీ విచారణను ఎదుర్కొన్న కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తుంటే.. ఫార్ములా ఈ కార్ రేసులో ఆయన పూర్తిగా ఇరుక్కున్నారని అర్ధమౌతోందని అంటున్నారు.
హైదరాబాద్, ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం (జనవరి 10) తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. సూర్యాపేట జిల్లా ఐలాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం చేయించింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చి తిరుపతిలో ఆ టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారికి వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.
హిందువులకు అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం (జనవరి 10) తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవ దేవుడిని దర్శించుంకుటున్నారు. తిరుమల లో కూడా తెల్లవారు జాముకు ముందే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.
కాసే చెట్టుకే రాళ్ల దెబ్బ‌లు అన్న‌ట్లు.. రాష్ట్రం అభివృద్ధికోసం, ప్ర‌జ‌ా స‌మ‌స్య‌ల ప‌రిష్క‌ారం కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మించే నాయ‌కుల‌పైనే విమ‌ర్శ‌లు, నింద‌లు ఎక్కువ‌. ఈ కోవ‌లో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముందు వ‌రుస‌లో ఉంటారు. రోజుకు ప‌ద్దెనిమిది గంట‌లు ప్ర‌జ‌ల‌ కోసం ప‌నిచేస్తూ, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థాయికి తీసుకెళ్లాల‌ని ఆయ‌న ఎప్పుడూ త‌ప‌న ప‌డుతుంటారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐటీ రంగానికి పెద్ద‌ పీట‌ వేసి త‌ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని యువ‌త ప్ర‌పంచ దేశాల్లో స‌త్తాచాటేందుకు చంద్ర‌బాబు కార‌ణ‌మ‌య్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.