Publish Date:Jan 10, 2025
తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. రెండు ఉపాధ్యాయ ఒక పట్టభధ్ర ఎన్నికకు సంబంధించి అభ్యర్థులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
Publish Date:Jan 10, 2025
అంబటి రాంబాబును వైసీపీ వదిల్చేసుకుంటోందా? ఆయన సొంత నియోజకవర్గం సత్తెన పల్లి ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి అంబటిని తప్పించడం ద్వారా ఆయనకు తన స్థానం ఏమిటో చూపిందా? అంటే వైసీపీ శ్రేణులే ఔనని అంటున్నాయి.
Publish Date:Jan 10, 2025
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన పోక్సో కేసును క్వాష్ చేయాలంటూ చెవిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం (జనవరి 10) తొసిపుచ్చింది.
Publish Date:Jan 10, 2025
కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలిన వైసీపీకి ఇప్పుడు రాజకీయంగా అత్యంత సంక్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ కోసం పని చేయడానికి సీనియర్లెవరూ పెద్దగా సుముఖత చూపడం లేదు. కొత్తవారెవరూ కనీసం పార్టీ వైపు దృష్టి పెట్టడం లేదు. ఆ పార్టీ కార్యక్రమాలన్నీ పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైపోయిన పరిస్థితి ఉంది.
Publish Date:Jan 10, 2025
తప్పొప్పులకు బాధ్యత ఎవరిది అన్న విషయాన్ని పక్కన పెడితే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఎంత కాదనుకున్నా ప్రభుత్వ ప్రతిష్ఠను ఒకింత మసకబార్చింది. కూటమి పార్టీలలో కూడా తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎవరి వాదన వారిదన్నట్లుగా కనిపిస్తోంది.
Publish Date:Jan 10, 2025
ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం గంటగంటకు మారుతుంది. నిన్న దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ కేసులో ఎవన్ నిందితుడైన కెటీఆర్ ను ఎసిబి విచారణ చేసింది. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఎసిబి విచారించింది.
Publish Date:Jan 10, 2025
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణకు శుక్రవారం (జనవరి 10) హాజరయ్యారు. రేసు జరిగిన సమయంలో ఆయన హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ గా ఉన్నారు.
Publish Date:Jan 10, 2025
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు చెల రేగిపోతున్నారు.
Publish Date:Jan 10, 2025
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావులో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరినట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. గురువారం (జనవరి 9) దాదాపు ఏడుగంటల పాటు ఏసీబీ విచారణను ఎదుర్కొన్న కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తుంటే.. ఫార్ములా ఈ కార్ రేసులో ఆయన పూర్తిగా ఇరుక్కున్నారని అర్ధమౌతోందని అంటున్నారు.
హైదరాబాద్, ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం (జనవరి 10) తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. సూర్యాపేట జిల్లా ఐలాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం చేయించింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చి తిరుపతిలో ఆ టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారికి వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.
హిందువులకు అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం (జనవరి 10) తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవ దేవుడిని దర్శించుంకుటున్నారు. తిరుమల లో కూడా తెల్లవారు జాముకు ముందే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.
కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు.. రాష్ట్రం అభివృద్ధికోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించే నాయకులపైనే విమర్శలు, నిందలు ఎక్కువ. ఈ కోవలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారు. రోజుకు పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తూ, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లాలని ఆయన ఎప్పుడూ తపన పడుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగానికి పెద్ద పీట వేసి తద్వారా తెలుగు రాష్ట్రాల్లోని యువత ప్రపంచ దేశాల్లో సత్తాచాటేందుకు చంద్రబాబు కారణమయ్యారు.