ఏబీవీపై కక్ష సాధింపే ముఖ్యం.. అందుకు సుప్రీం కోర్టు తీర్పునైనా ధిక్కరిస్తాం!
Publish Date:May 17, 2022
Advertisement
జగన్ విపరీత మనస్తత్వానికి ఏబీవీ విషయంలో అనుసరిస్తున్న వైఖరే తాజా నిదర్శనం. కక్ష సాధింపు మనస్తత్వం జగన్ ది అని ఏబీవీ విషయంలో ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న తీరే చెబుతుంది. ఏబీవీ సస్పెన్షన్ ముగిసిందనీ, ఆయనక తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీం కోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చినా జగన్ సర్కార్ ఖాతరు చేయడం లేదు. ఆయనకు పోస్టింగ్ విషయంలో కోర్టు ధిక్కరణ నేరాన్ని ఎదుర్కొనేందుకైనా సిద్ధపడుతోందని చెప్పకనే చెబుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల తరువాత ఇప్పటి వరకూ రెండు సార్లు పోలీసు అధికారుల బదలీలను జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఈ రెండు సార్లూ కూడా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వలేదు.తాజాగా మంగళ వారం దాదాపు పాతిక మంది ఐపీఎస్ లను జగన్ సర్కార్ బదలీ చేసింది. ఏసీబీ డీజీపీ సహా పలువురు అధికారులను బదలీ చేసింది. వారిలో పలువురికి అదనపు బాధ్యతలూ కట్టబెట్టింది. కానీ సుప్రీం ఆదేశించినా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు (ఏబీవీ) విషయం మాత్రం పట్టించుకోలేదు. సుప్రీం కోర్టు తీర్పు కాపీని తీసుకుని ఏబీవీ ఏపీ సీఎస్ ను కలిసినా ఫలితం లేకపోయింది. అసలు ఏబీవీకి అప్పాయింట్ మెంట్ ఇవ్వడానికే సీఎస్ సుముఖత చూపడం లేదు.గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీవీపై వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పలు ఆరోపణలు చేసింది. కేసులు నమోదు చేసి సస్పెన్షన్ వేటు వేసింది. రెండేళ్లు అయినా ఆయనపై కేసులు తేలకపోవడంతో సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా ముగిసిందని సుప్రీం కోర్టు చెప్పింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయడం లేదు. కోర్టు ధిక్కరణ కేసునైనా ఎదుర్కొంటా కానీ ఏబీవీపిని మాత్రం సర్వీసులోకి తీసుకోం అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇది కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని విశ్లేషిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ధిక్కరణకు జగన్ సర్కార్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొన వలసి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-ready-to-face-contempt-of-court-insted-giving-post-to-abv-25-136040.html





