ఇవేం సమీకరణాలు.. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులపై పరిశీలకుల విస్మయం

Publish Date:May 18, 2022

Advertisement

ఏపీలో వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పట్ల రాజకీయ వర్గాలలో విస్మయం వ్యక్తమౌతున్నది. రాష్ట్ర ప్రయోజనాలు, సామాజిక సమీకరణాలతో సంబంధం లేకుండా కేవలం అధినేత ఇష్టాయిష్టాలు, వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు అనిపిస్తున్నదని వారు విశ్లేషిస్తున్నారు. ఉన్న నాలుగు స్థానాలలో ఇద్దరు వేరే పార్టీ నుంచి జంప్ జిలానీ పద్ధతిలో వచ్చిన వారైతే మిగిలిన ఇద్దరూ తనతో పాటు ఆర్థిక నేరాలలో సహ నిందితులు కావడాన్ని ఎత్తి చూపుతున్నారు.

అలాగే వైసీపీ ప్రకటించిన నలుగురు అభ్యర్థులలో ఇద్దరు బీసీలు కాగా మిగిలిన ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. అలాగే ప్రకటించిన ఇద్దరు బీసీ అభ్యర్థులూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారే. వారిద్దరిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను జగన్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం వెనుక కూడా క్విడ్ ప్రోకో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ నుంచి  రాజ్యసభకు కేసీఆర్ ఒక ఫార్మా కంపెనీ అధినేతను రాజ్యసభకు పంపనున్నారనీ, ఆ ఫార్మా కంపెనీ అధినేత వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి వియ్యంకుడు కావడంతో అందుకు ప్రతిగా తెలంగాణ సీఎం సిఫారసు చేసిన ఆర్. కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు జగన్ నిర్ణయించారని చెబుతున్నారు.

ఇక బీసీ కోటాలో రాజ్యసభకు జగన్ ఎంపిక చేసిన మరో వ్యక్తి బీద మస్తాన్ రావు. ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన వలస పక్షి. బీద మస్తాన్ రావుది నెల్లూరు జిల్లా కావ‌లి. ఈయ‌న కావ‌లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హించారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున నెల్లూరు లోక్ సభ స్థానానికి  పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నే అసంతృప్తితో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఇక మిగిలిన రెండు స్థానాలలో ఒకటి సిట్టింగ్ ఎంపీ విజయసాయిరెడ్డికే ఇచ్చారు.

ఆయన జగన్ అక్రమాస్తుల కేసులో ఏ-2 అన్న సంగతి తెలిసిందే. ఇక నాలుగో స్థానం జగన్ అక్రమాస్తుల కేసులు వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డికి ఇచ్చారు. ఇలా వైసీపీ నాలుగు రాజ్యసభ స్థానాలూ కూడా జగన్ వ్యక్తిగత ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఎంపికేనని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. క్విడ్ ప్రోకొ కింద తెలంగాణకు చెందిన ఆర్.లక్ష్మయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి కూడా బీసీ ఉద్ధరణ కోసమే అని చెప్పుకోవడం జగన్ కే చెల్లిందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. 
 

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.