జగన్ జెయింట్ కిల్లర్స్ ను పక్కన పెట్టేస్తారా?.. జనసేనానికి ఓడించిన గ్రంథి అసంతృప్తి

Publish Date:May 16, 2022

Advertisement

భీమవరం ఎమ్మెల్యే గ్రంధీ శ్రీనివాస్.. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆయన వర్గం. గత ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఆయన ఘన విజయం సాధించి  అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఈ భీమవరం ఎమ్మెల్యే గారికి ప్రస్తుతం ప్యాన్ పార్టీలో కష్ట కాలం నడుస్తోందనే ఓ టాక్   నియోజకవర్గంలోనే   హల్‌చల్ చేస్తోంది. ఈ భీమవరం ఎమ్మెల్యే గారికి తాడేపల్లి ఫ్యాలెస్‌లో సీఎం వైయస్ జగన్ అపాయింట్‌మెంటే దొరకడమే లేదంట.

ఆ క్రమంలో సీఎం అపాయింట్‌మెంట్ కోసం రీజినల్ పార్టీ కో ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ పి. మిథున్ రెడ్డి చుట్టు ఆయన ఎన్ని ప్రదక్షణాలు చేసినా.. చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదట. దీంతో ఈ భీమవరం బుల్లోడి పరిస్థితి అంత అగమ్య గోచరంగా తయారైందని సమాచారం. దాంతో ఆయన గారి వర్గం ఇప్పటికే తీవ్ర నిరాశలోకి జారిపోయిందట.  

అయితే 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై గ్రంథీ శ్రీనివాస్ గెలిచినప్పుడు... ఫ్యాన్ పార్టీ అగ్రనేతలంతా ఆయనకు గట్టి వెయిటేజి ఇచ్చారట. ఒకానొక దశలో జగన్  తొలి కేబినెట్‌లో ఈ భీమవరం ఎమ్మెల్యేకు బర్త్ కూడా గ్యారెంటీ అనే టాక్ కూడా   నడిచిందట. కానీ అది ఎందుకో జరగలేదు. 

కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఈ గ్రంధీ శ్రీనివాస్‌తో ప్రెస్‌మీట్ పెట్టించి మరీ పవన్ కల్యాణ్‌పై విమర్శనాస్త్రాలు చేయించే వారనే ఓ టాక్ కూడా గట్టిగానే నడించింది. ఆ తర్వత గ్రంధీ శ్రీనివాస్‌ను పార్టీ నేతలు పక్కన పెట్టి.. ఆయన స్థానంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, వెల్లంపల్లి తదితరులతో ప్రెస్ మీట్లు పెట్టించి చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయించడం మొదలు పెట్టారు.  అందుకు కారణం వారిలో భీమవరం ఎమ్మెల్యేకు వాగ్ధాటి లేకపోవడమే కారణమని అప్పట్లో ఓ రేంజ్ లో చర్చ జరిగింది. సరే అదంతా పక్కన పెట్టినా పవన్ కల్యాణ్ పై విజయం సాధించినా తొలి, మలి కేబినెట్ లలో కూడా జగన్ గ్రంథికి స్థానం కల్పించడకోవడంతో గ్రంథిలో, ఆయన వర్గీయులలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయని నియోజకవర్గంలో బాగా ప్రచారంలో ఉంది. అయితే జెయింట్ కిల్లర్స్ ను జగన్ పట్టించుకోరని పార్టీలో ఓ టాక్ జోరుగా నడుస్తోంది. ఇందుకు ఉదాహరణగా గాజువాకలో పవన్ కల్యాణ్ పై విజయం సాధించిన తిప్పల నాగిరెడ్డి, మంగళగిరిలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా చంద్రబాబునాయుడి కుమారుడు లోకేష్ పై విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు సైతం జగన్ తన కేబినెట్ లో స్థానం కల్పించకపోవడాన్ని వారు ఉదాహరణగా చూపుతున్నారు. అయితే దీనిపై పార్టీలోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  జెయింట్ కిల్లర్స్ కు కేబినెట్ లో స్థానం కల్పించి ఉంటే జనంలోకి ఒక పాజిటివ్ సందేశం వెళ్లి  ఉండేదని పరిశీలకులు అంటున్నారు. ఆ అవకాశాన్ని జనం కోల్పోవడమే కాకుండా.. ప్రత్యర్థి పార్టీల్లోని పెద్ద తలకాయలపై విజయం సాధించిన వారికి జగన్ పార్టీలో గుర్తింపు లేకుండా చేస్తారనీ, ప్రత్యర్థి పార్టీలోని ప్రముఖుల ఓటమిని సైతం తన ఖాతాలో వేసుకోవాలన్న ఉద్దేశమే అందుకు కారణమనీ వారు విశ్లేషిస్తున్నారు. 

అదే ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున అసంతృప్తి జ్వాలలు, అసమ్మతి సెగలు ఎగిసి పడటానికి కారణమని వారు వివరిస్తున్నారు. మాజీ మంత్రుల మౌనం, ఆశావహుల ధిక్కారం, ఆదేశించినా గడప గడపకూ కదలని నేతల వైనం వైసీపీలో జగన్ మాట గతంలోలా చెల్లుబాటు కావడం లేదనడానికి నిదర్శనాలుగా చెబుతున్నారు.

By
en-us Political News

  
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది.
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.