అగ్రరాజ్యంలో జాత్యాహంకార జాడ్యం.. కాల్పుల మోతతో మృత్యుమృదంగం
Publish Date:May 16, 2022
Advertisement
అగ్రరాజ్యం అమెరికాలో జాత్యాహంకార జాడ్యం కాల్పుల మోతతో మరణ మృదంగం వాయిస్తోంది. ఆదివారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో పది మంది మరణించిన ఘటన మరువక ముందే.. దేశంలో రెండు ప్రాంతాలలో కాల్పుల మోత మార్మోగింది. \ఈ ఘటనల్లో ముగ్గరు మరణించగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. హోస్టన్ సూపర్ మార్కెట్‌లో ఐదుగురు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకడు గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇక కాలిఫోర్నియా చర్చ్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా, ఆదివారం న్యూయార్క్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దుండుగుడి కాల్పుల్లో పది మంది మృతి చెందారు. \మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సూపర్ మార్కెట్‌లోకి సైనికుడి వేషదారణలో తుపాకీతో ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు.. అక్కడున్న వారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. జాత్యాహంకారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/firing-culture-in-america-25-135930.html





