ముద్రగడ పాడె మోసిన జగన్!

Publish Date:Jul 15, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, మరీ ముఖ్యంగా కాపు సామాజికవర్గ ఉద్యమాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక  ముద్ర ఉన్న  సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంతిమ యాత్రలో వైసీపీ అధినేత జగన్ పాల్గొనడమే కాకుండా.. స్వయంగా ఆయన పాడె మోశారు. గత కొంతకాలంగా  అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఆరోగ్యం విషమించి ముద్రగడ మంగళవారం (జులై 14)న తుది శ్వాస విడిచిన సంగతి విదితమే.

ఆయన వయస్సు 73 ఏళ్లు.  ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు.. ఆయన స్వగ్రామమైన కిర్లంపూడిలో బుధవారం (జులై 15) జరిగాయి.   భీమవరంలో పర్యటించి అక్కడి ఆక్వారైతులతో భేటీ అయిన తరువాత జగన్ బుధవారం మధ్యాహ్నానికి  కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్నారు. ముద్రగడ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  

ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని  ఓదార్చారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ పరంగా తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ మరణం కేవలం వారి కుటుంబానికే కాకుండా వైసీపీకి, ఆయనను ఆరాధించే లక్షలాది మంది అభిమానులకు తీరని లోటన్నజగన్..  నమ్మిన సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైనా వెళ్లే అరుదైన నైజం ముద్రగడ సొంతమని, ఆత్మగౌరవానికి,  నిజాయితీకి నిలువెత్తు రూపమని అన్నారు. అనంతరం ముద్రగడ అంతిమ యాత్రలో స్వయంగా  ముద్రగడ పద్మనాభం పాడె మోశారు. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉన్న వారి సొంత స్థలంలో అంత్యక్రియల ప్రక్రియను నిర్వహించారు. 

Mudragada Padmanabham, YS Jagan, Kirlampudi, Mudragada Funeral, Botsa Satyanarayana, YSRCP News 

By
en-us Political News

  
రోడ్డు మార్గం ద్వారా  కిర్లంపూడి చేరుకునివంగత నేత ముద్రగడ భౌతికకాయానికి అంజలి ఘటించి,   వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 
దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు.
స్థానిక అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సిఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన జల పూజలో ముఖ్యమంత్రి పాల్గొని, కృష్ణవేణి, సప్త గోదావరి దేవతలకు నీరాజనాలు సమర్పించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్ర గడ కుటుంబ సభ్యులు  తిరస్కరిం చారు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే కిర్లంపూడిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 
ఐదేళ్ల జగన్ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, జల సంరక్షణ చర్యలను పోలుస్తూ విపులంగా మాట్లాడారు. అయితే విశ్వేశ్వరరెడ్డి సొంత పార్టీ సమావేశంలో నిజాలను చెప్పడం ఆ పార్టీ అధినాయకత్వానికి నిషూరమైంది.
ఆదాయపు పన్ను శాఖకు ఐటీఏటీ ITAT షాక్ ఇచ్చింది. మూడో వ్యక్తి వద్ద దొరికిన కాగితాలు, డైరీల ఆధారంగా స్వతంత్ర సాక్ష్యాలు లేకుండా పన్ను డిమాండ్లు విధించడం కుదరదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్థిక సంవత్సరం 2027 క్యూ1 లో నువోకో విస్టాస్ అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఏకంగా 20% లాభాల వృద్ధి, రికార్డు స్థాయి EBITDA నమోదు కావడంతో బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుపై ఏకంగా 47% అప్‌సైడ్ టార్గెట్‌ను నిర్దేశించాయి. ఆ వివరాలు మీకోసం.
దేశీయ మార్కెట్‌లో ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ యుద్ధ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నేటి 24K, 22K, 18K గోల్డ్ లేటెస్ట్ రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించి స్పెయిన్ ఫైనల్ చేరింది. నాకౌట్ మ్యాచ్ లలో కిలియన్ ఎంబాపెపై లామిన్ యమల్ 6-0 తో తన అజేయ రికార్డును ఎలా కొనసాగించాడో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో స్పెయిన్ సంచలనం సృష్టించింది. హాట్ ఫేవరెట్ ఫ్రాన్స్‌ను 2-0 గోల్స్ తేడాతో ఓడించి 2010 తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
విదేశీ ఆదాయంపై రెండు దేశాల్లో పన్నులు చెల్లించి నష్టపోతున్నారా? ఇన్కమ్ టాక్స్ రూల్ 128 ప్రకారం ఫామ్ 67 (Form 67) ఆన్‌లైన్‌లో ఫైల్ చేసి, ఫారిన్ టాక్స్ క్రెడిట్ FTC ద్వారా భారతదేశంలో మీ పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలతో తెలుసుకోండి.
దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ రూ. 9,795 కోట్ల భారీ ఐపీఓతో మార్కెట్లోకి వచ్చింది. లేటెస్ట్ జీఎమ్‌పీ, సబ్‌స్క్రిప్షన్ వివరాలు మరియు నిపుణుల ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
టాటా ఎల్క్సీ Tata Elxsi Q1 ఫలితాల తర్వాత షేరు 6% క్రాష్ అయింది. మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్‌పై సెల్ రేటింగ్ ఇస్తూ, ఇంకా 16% మేర పతనమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. పూర్తి వివరాలు మరియు మార్జిన్ల లెక్కలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.