జగన్ వేట.. టీడీపీ నేతలకు గాలం..?

Publish Date:Aug 27, 2022

Advertisement

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో వైసీసీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారట.. వివిధ సర్వే నివేది కలను సమీక్షించిన తర్వాత ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేల్లోని అధిక శాతం మందికి టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్ లేదని ఇప్పటికే జగన్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో వ్యక్తిగత ఇమేజ్ ఉన్న టీడీపీ నేతలకు గాలం వేయడానికి జగన్ స్కెచ్ వేశారట. తన ఇమేజ్ తోనే ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని కలలు గన్న జగన్ ఇలా ఎందుకు టీడీపీ నేతల వైపు చూస్తున్నారనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఫ్యాన్ గాలికి తిరుగే లేదని ఇంతకాలం ఊహల్లో విహరించిన జగన్.. ఇప్పుడు వాస్తవ పరిస్థితిని గుర్తించక తప్పలేదంటున్నారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే రీతిలో కళ్లు ఆకాశం వైపు చూసిన వైసీపీ అధి నేతకు ఇప్పుడు బొమ్మ కనిపించి.. దిమ్మదిరిగి.. అవే కళ్లు బైర్లు కమ్మి.. టీడీపీ నేతలకు ఎర వేయడానికి రెడీ అయ్యారంటున్నారు.

ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి జనంలో మంచి పట్టు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతలను జిల్లాకు ముగ్గురు, నలుగురు చొప్పున వైసీపీలో చేర్చుకోవాలని జగన్ తహతహలాడుతున్నారని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలో దిగితే.. వారికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా.. తాను చూసుకుంటానని తన పార్టీలో చేరితే చాలని టీడీపీ నేతలకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు సమా చారం. అయితే.. ఈ పనికి చేసేందుకు వైసీపీ నేతలను కాకుండా తనకు వ్యక్తిగత పరిచయాలున్న ఇతర నేతలను జగన్ ప్రయోగిస్తుండడం గమనార్హం. ఏమాత్రం ఈ సమాచారం లీకైనా స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ చేసే అవకాశాలు ఉన్నాయని.. జగన్ తానే స్వయంగా ఈ పని చేసుకుంటున్నారట.

జగన్ చేయించుకున్న సర్వేలో వైసీపీ మునిగిపోతున్నదని, ఇప్పుడున్న సీట్లలో సుమారు వందకు పైనే అడ్రస్ గల్లంతవుతాయని నివేదికల సారాంశంగా ఉందంటున్నారు. వైసీపీ అభ్యర్థులను మార్చేటపుడు స్థానికంగా తప్పకుండా గెలిచే టీడీపీ నేతలను తెచ్చుకోవాలని ప్రశాంత్ కిశోర్ టీమ్ జగన్ కు సలహా ఇచ్చిందట. అందుకోసం జగనే స్వయంగా టీడీపీ నుంచి నేతల ఆకర్ష్ ప్రారంభించారట. జగన్ నేరుగా రంగంలోకి దిగి, ‘క్యాష్ ఫ్రీ టిక్కెట్ పక్కా’ అంటూ హామీలు ఇస్తున్నారని సమాచారం.

కరోనా అనంతరం జగన్ బండారాన్బి ఎండగడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పక్క.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో పక్కన చేస్తున్న కార్యక్రమాలు జనంలోకి బాగా వెళ్లడంతో జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే సొంత పార్టీ నేతలకు తెలియకుండా తానే స్వయంగా గెలుపు గుర్రాలుగా భావిస్తున్న టీడీపీ నేతలను నేరుగా ఆహ్వానిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో ఈ మధ్యనే కొందరు రాయలసీమ టీడీపీ నేతలను జగన్ టచ్ చేశారని సమాచారం.

నిజానికి రాయలసీమ ప్రాంతతో పాటు ప్రకాశంజిల్లా వరకు వైసీపీకి మంచి పట్టే ఉంది. అయితే ఇక్కడ చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయం పసిగట్టిన జగన్ ముందు రాయలసీమలో, ప్రకాశంజిల్లాల్లో చక్కదిద్దితే ఆ ఎఫెక్ట్ రాష్ట్రమంతా పడుతుం దని స్కెచ్ వేశారట. అయితే జగన్ ప్రతిపాదనపై కొందరు టీడీపీ నేతలు సరిగా స్పందించ లేదట. దీంతో ఆ టీడీపీ నేతల వారసుల నుండి వత్తిడి తెచ్చే ప్రయత్నం జగన్ చేస్తున్నారని తెలుస్తోంది. పాలనపై దృష్టి సారించకుండా ఇలా విపక్షంలోని నేతల కోసం పరుగులు తీయడాన్ని చూస్తుంటే.. జగన్ కు ఓటమి భయం పట్టుకుందనే అంచనాలు వస్తున్నాయి.

By
en-us Political News

  
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.