Publish Date:Aug 11, 2026
కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకపోయినా, నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పని సరై కాంగ్రెస్ లో చేరానని ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది, అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది, అయినా కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తాను కప్పుకున్నది జాతీయ జెండా అనీ, కాంగ్రెస్ జెండా ఎంత మాత్రం కాదనీ చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం స్వయంగా చెబితేనే కాంగ్రెస్ లో చేరానన్న ఆయన.. ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని సీఎం ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు.
నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఫలితం లేకపోయిందన్నారు. తాను వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేశాననీ, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదనీ చెప్పిన పోచారం.. నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డిని ఈ విషయమై సూటిగా ప్రశ్నించానని చెప్పారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారని పోచారం తెలిపారు.
Pocharam Srinivas Reddy, Revanth Reddy Congress, Banswada Constituency, Telangana Politics News, Pending Bills Release, Pocharam News Telugu
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pocharam-srinivas-reddy-25-228688.html
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.