వైసీపీ ర్యాలీలో కేటీఆర్ ఫ్లెక్సీ.!

Publish Date:Aug 11, 2026

Advertisement

ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో వైసీపీ  చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.మెగా డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ..  మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నేతృత్వంలో జీలుగుమిల్లలో వైసీపీ  ర్యాలీ నిర్వహించింది.  ఈ ర్యాలీలో వైసీపీ ప్రదర్శించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారాయి.

ఎందుకంటే..  జీలుగుమిల్లిలో వైసీపీ చేపట్టిన ర్యాలీలో  ఆ పార్టీ కార్యకర్తలు    మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్  ఫ్లెక్సీలతో పాటు  ఏపీతో ఏ మాత్రం సంబంధం లేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,  కేటీఆర్ ఫ్లెక్సీ కూడా  ప్రదర్శించారు. వైసీపీ ర్యాలీలో పొరుగు రాష్ట్రానికి చెందిన కీలక నాయకుడి ఫొటో కూడా దర్శనమివ్వడం అందరినీ విస్మయానికి గురి చేసింది,  

 ఈ ర్యాలీలో..  రాసి పెట్టుకోండి.. 2029లో మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే" అనే  నినాదాలతో ఉన్న ప్లకార్డులను, ఫ్లెక్సీలను వైసీపీయులు ప్రదర్శించారు. అయితే సదరు ఫ్లెక్సీపై  వైసీపీ అధినేత జగన్ పక్కన కేటీఆర్  ఫొటో కూడా ఉండటం కలకలం సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం ఇక్కడ ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

నెటిజన్లు ఈ   ఫ్లెక్సీలను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రధాన రాజకీయ పార్టీల నేతల బొమ్మలు ఒకే ఫ్లెక్సీలో దర్శనమివ్వడం వెనుక ఏదైనా  పొలిటికల్ స్ట్రాటజీ ఉందా అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది.   ఏపీ  డీఎస్సీ అవకతవకలకు నిరసనగా జరుగుతున్న ర్యాలీలో బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ఫోటో ఎందుకంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. అయితే ర్యాలీలో కేటీఆర్ ఫొటోపై వైసీపీ నుంచి ఎటువంటి వివరణా రాలేదు. 

YCP protest rally,  Jagan and KTR flexi, Eluru Rally, Former MLA Tellam Balaraju, Andhra Pradesh politics, TeluguOne

By
en-us Political News

  
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.