మద్యపాన నిషేధం తూచ్! మడమ తిప్పడమే జగన్ రూట్
Publish Date:Dec 18, 2021
Advertisement
నేను విన్నాను.. నేను చూసాను.. నేను ఉన్నాను.. 2019 సార్వత్రిక ఎన్నికల్ల ప్రచారంలో జగన్ రాష్ట్ర మంతా చెప్పిన మాట ఇది. మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేది ఇది కూడా ఆయన ఊత పదం. ఈ ప్రచారమే ఆయనకు కలిసొచ్చిందని అంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా హామీలు ఇచ్చారు జగన్ రెడ్డి. అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు. జగన్ ప్రదాన వాగ్దానం లొ మద్యపాన నిషేధం ఒకటి. అయితే అధికారంలోకి వచ్చాకా తానిచ్చిన హామీలపై ఒక్కొక్కటిగా మడమ తిప్పేస్తున్న జగన్,, తాజాగా మద్యపాన నిషేధం వాగ్దానాన్ని పుర్తిగా గాల్లొ కలిపేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లో హేతుబద్ధత తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు భారిగా తగ్గే అవకాశం ఉంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) రకం మద్యంపై 5 నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకు ధరలు తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయి.మొత్తం మీద15 నుంచీ 20శాతం ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలో నాటు సారా తయారీని అరికట్టేందుకే ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37 శాతం మేర మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మద్యపాన నిషేదం ఎన్టీఆర్ తరహాలొ జరుగుతుందని చిన్న, మద్యతరగతి మహిళలు పుర్తిగా విశ్వసిసించారు. జగన్ భారీ మెజారిటీతో గెలవడానికి మద్యపాన నిషేధం ప్రదాన మని చెప్పవచ్చు. అనుకున్నట్టుగానే జగన్ ప్రభుత్వం వచ్చింది. తొలినాళ్ళలో మద్యపాన నిషేధం జరుగుతుందని అందరూ ఎదురు చూసారు. కాని జగన్ తెలివిగా అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అని ప్రకటించారు. మద్యపాన జరగాలంటే అధిక రేట్లు పెంచడం ఒక్కటే మార్గమని దాని వల్ల తాగేవారి సంఖ్య తగ్గుతుందని జనాన్బి నమ్మించారు. ఇలా కొంతకాలం అధిక దరలకు అమ్మకాలు చేసి సొమ్ము చేసుకున్నారు. కాలం గడిచేకొద్ది ప్రజలకు అనుమానం రాకుండా బెల్ట్ షాపులు తగ్గించారు.. మిల్లీ రేట్లు పెంచారు. రకరకాల బ్రాండ్లు మార్కెట్లోకి తెచ్చి విచ్చలవిడిగా విక్రయాలు చేసారు. ఇప్పుడు ఏకంగా ప్రధాన నగరాల్లో లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేసారు. మద్యపాన నిషేధం సంగతి దేవుడెరుగు మద్యం అమ్మకాల వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసారు. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ధరలు పెంచటమే కాకుండా ఎప్పుడూ విననీ చుడని బ్రాండ్లు దింపేసారు దీంతో పక్క రాష్రమైన తెలంగాణ మద్యం కు మంచి గిరాకీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లొ పొరుగు రారాప్టం మద్యం ఏరులై పరడంతొ ఇప్పుడు ఆ సాకు చూపి మద్యం రేట్లు తగ్గించే దిశగా అడుగులు వేసారు. దింతీ ఇక మద్యపాన నిషేధం పుర్తిగా లేనట్టెనని చెప్పకనే చెప్పింది జగన్ సర్కార్. మద్యపాన నిషేదంపై ఆశలు పెట్టుకున్న మహిళలను ఇప్పటి వరకు కన్ఫ్యూష్ చేస్తూ కాలయాపన చేసి ఇప్పుడుయయ ఇక మద్యపాన నిషేధం లేదనే సంకేతాలు పంపింది జగన్ సర్కార్. దీంతో ఇంతన్నాడు జగనన్న నట్టేల్లొ ముంచేసాడు అని తెగ చెర్చించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ మహిళామనులు.
http://www.teluguone.com/news/content/jagan-govt-changes-liquor-rates-39-128664.html





