తెలంగాణలో డేంజర్ బెల్స్.. 20కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
Publish Date:Dec 18, 2021
Advertisement
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 12 ఒమిక్రాన్ కేసులు నిర్దారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి పెరిగింది. శనివారం ఒమిక్రాన్ నిర్దారణ అయిన వారంతా విదేశాల నుంచి తెలంగాణ వచ్చినవారే. తాజాగా ఒమిక్రాన్ సోకిన వారిలో తొమ్మిది మంది ఫారినర్స్ కాగా.. ముగ్గురు ఇండియన్స్. వీరిలో ఇద్దరు ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించగా..మిగితా పది మంది నాన్ రిస్క్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్లు కావడం మరింత ఆందోళన కల్గిస్తోంది. శనివారం ఒమిక్రాన్ నిర్దారణ అయిన వారిలో కెన్యా నుంచి వచ్చిన వాళ్లు ఆరుగురు కాగా, సోమాలియా 2, యూఏఈ ఇద్దరు, ఘనా, టాంజానియా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇక కెన్యా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ఒమిక్రాన్ రోగి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు చివరికి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాహి ఇబ్రహీం అనే 44 ఏళ్ల వ్యక్తి డిసెంబరు 14న హైదరాబాద్ వచ్చాడు. ఎయిర్ పోర్టులో అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే అతడు టోలీచౌకిలో నివాసం ఉంటున్నాడని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి చూడగా, అతడు కనిపించలేదు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తీవ్రస్థాయిలో వేట సాగించిన పోలీసులు... అపోలో ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్ లో అతడిని పట్టుకున్నారు.అనంతరం ఆ కెన్యా దేశస్తుడిని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
http://www.teluguone.com/news/content/12-more-omicron-cases-detected-in-telangana-39-128662.html





