జగన్‌ నిలుస్తాడా? కలుస్తాడా?

Publish Date:Jul 19, 2012

Advertisement

వైసిపి నేతజగన్‌ పై సిబిఐ జోరు తగ్గింది. దానికి కారణం ప్రణబ్‌కు వోట్లు వేయడమేనని అందరికీ తెలుసు. రానున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలకు కూడా కాంగ్రెస్‌ ప్రతిపాదించిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి కే  ఓటు వేస్తామని వైపిపి ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే  కాంగ్రెస్‌తో  వైసిపి మధ్య అవగాహన మరింత పెరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతికి ఓటు వేయటానికి అభ్యంతరం తెలుపని సిబిఐ కోర్టు రానున్న రోజుల్లో బెయిల్‌ పై కూడా కౌంటర్‌ చార్జిషీటును పెట్టదని, అలాగే అభ్యంతరం కూడా తెలుపదని అనుకుంటున్నారు.


మొన్నటివరకు ఉప్పు నిప్పులాగా ఉన్న కేంద్రం, వైసిపి పార్టీ కూల్‌ గా కనిపించడంతో ప్రతిపక్షాలకు, ప్రజలకు ఇప్పుడు ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. వైసిపి పార్టీ  ఎలాగూ కాంగ్రెస్‌ తాను లో గుడ్డే కాబట్టి కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు ప్రధాన ప్రతిపక్షాలు. క్విడ్‌ ప్రో కొ  కేసులో  జగన్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇది అప్పటి ప్రభుత్వానికి సంభందించింది. నేను దాని పరిధిలోనికి రాను అంటూ వైయస్‌ జగన్‌ కోర్టులో అప్పీలు చేసుకున్న నేపధ్యంలో సుప్రీం కోర్టు అప్పటి మంత్రులకు కూడ నోటీసులు జారీ చేసింది.



దాని పరణామ క్రమంలో మంత్రులు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని ప్రభుత్వం వారిని  సమర్ధించిన కారణంగా జగన్‌కు ఊరట కల్పించినట్లయింది. దీనికి తోడు  ఇటీవల వైసిపి గౌరవాద్యక్షురాలు విజయలక్ష్మీ ప్రధాన మంత్రిని, ఇతర మంత్రులను కలిసిన తరువాత ఇక్కడ వైసిపి నేతల మీద కాంగ్రెస్‌నేతలు, సిబిఐ జోరు తగ్గిందనే చెప్పుకోవచ్చు. అందువల్ల రానున్న రోజుల్లో వైసిపి కాంగ్రెస్‌లో కలిపోనుందనే ప్రతిపక్షాలు జోస్యం చెబుతున్నారు. అయితే యువనేత జగన్‌ మడమతిప్పని నేతగా ఉంటారో లేదా రాజకీయాలలో శాశ్వత మిత్రులుగాని శాశ్వత శత్రువులుగాని ఉండరని మరోసారి ఋజువు చేస్తారో తెలియాలంటే కొంచెం ఓపిక పట్టాల్సిందే.

By
en-us Political News

  
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.