‘మీడియా’తో వార్‌ జగన్‌ బెయిల్‌ కోసమేనా ?

Publish Date:Jun 22, 2012

Advertisement

అక్రమాస్తుల కేసులో చెంచల్‌గూడా జైలులో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి తన బెయిల్‌ కోసం సాక్షి దినపత్రిక, న్యూస్‌ఛానల్‌ ఉపయోగించుకుని మీడియాతో యుద్ధానికి దిగారు. నేరుగా తాను సీనులో లేకపోయినా జగన్‌ జైలులోనే ఉండి మంత్రాంగం నడుపుతున్నారని, ఆయన ఆదేశాలపైనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, న్యూస్‌ఛానల్‌, పత్రిక సిబ్బంది ఇతర పత్రికలపై కయ్యానికి కాలుదువ్వారని తెలుస్తోంది. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో? అప్పుడు తయారు చేయించే బులెటిన్స్‌(ప్రత్యేక సంచికలు) ఎలా ఉండాలో? కూడా జగన్‌ నిర్దేశించారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు తాను బెయిల్‌పై బయటకు వచ్చేందుకు హైకోర్టులో పిటీషను వేసిన జగన్‌ తరుపున న్యాయవాదులపై ఇతర మీడియా దృష్టి పడకూడదనే ఈ యుద్దాన్ని జగన్‌ ఒక ప్రణాళిక ప్రకారం సృష్టించారని తెలుస్తోంది. ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, క్రైమ్‌రిపోర్టర్లు తన బెయిల్‌ గురించి వార్తలు గుప్పిస్తే న్యాయమూర్తి విచారణ ముగిసేంత వరకూ జైలు నుంచి రానీయరేమో అన్న అనుమానంతోనే జగన్‌ మీడిమా మధ్యవార్‌కు వ్యూహాన్ని అమలు చేశారు. ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి అసెంబ్లీలోని గాంధీబొమ్మ ముందు కూర్చోబెట్టి మొత్తం నాటకం అంతా సాక్షి ఛానల్‌, పత్రిక ఆడేశాయి. అంటే వారిని కేవలం పాత్రధారులుగా చూపారే కానీ, మొత్తం అన్ని అంకాలూ కూర్చిరచించింది మాత్రం జగన్‌ అని అనుమానాలు పెల్లుబుకుతున్నాయి.

 

 

 

రాష్ట్రపతి ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన కాంగ్రెస్‌ ఇంకా కసరత్తులు చేస్తూ ఉన్న ఈ సమయంలోనే తన బెయిల్‌ మంజూరు అవ్వాలని, లేకపోతే ఇంకెన్నేళ్లు గడిచినా బయటికి రానీయరని జగన్‌ అనుమానించారు. అందుకే తెలివిగా బెయిల్‌ పిటీషన్‌ మూవ్‌ చేస్తూనే గాంధీబొమ్మ వద్ద ఎమ్మెల్యేలను ఉంచి సాక్షితో ముందు సిబిఐ జెడి లక్ష్మినారాయణపై విమర్శలు చేయించారు. ఇప్పటి వరకూ చీప్‌ట్రిక్స్‌ పెద్దగా ప్లే చేయని జగన్‌ ఆ నాయకులను తెరపై చూపి క్రైమ్‌రిపోర్టర్లు, ఇతర ప్రతినిధులు సిబిఐ జెడికి ఫోన్‌కాల్స్‌ చేసిన వివరాలు(లిస్ట్‌) వెలుగులోకి తెచ్చారు. వార్తల కోసం జెడితో మాట్లాడటమే తప్పు అన్నట్లు తన ఛానల్‌, పత్రికల్లో వార్తలు రాయించారు. పైగా జెడికి సంబంధించిన మొత్తం సమాచారం తామూ సేకరిస్తున్నామని సాక్షిఛానల్‌, పత్రిక నిరూపించుకున్నాయి. అంటే సిబిఐ ఎంక్వయిరీకి సమాంతరంగా తమ ఛానల్‌ విలేకరులూ విషయాలను ఎంక్వయిరీ చేయగలరని చూపించారు. దీంతో తన ప్రతీ అడుగూ సాక్షికి తెలుస్తుందన్న భయాన్ని సిబిఐజెడికి కల్పించాలన్నది జగన్‌ ఉద్దేశ్యం కావచ్చు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా జగన్‌ పాచిక పారిందనే చెప్పాలి. తనపై విమర్శలు వచ్చినా జగన్‌ ఏమి చేస్తున్నారో అన్న అంశం నుంచి మీడియా దృష్టి మళ్లించగలిగారు. ప్రెస్‌క్లబ్బులు, క్రైమ్‌రిపోర్టర్ల అసోసియేషన్లు, ఎపిడబ్ల్యుజె, ఎపిడబ్ల్యుజెఎఫ్‌ తదితరాలు సాక్షిఛానల్‌, పత్రిక చేసిన ఆరోపణలపై మల్లగుల్లాలు పడుతున్నాయి. హైకోర్టులో తన బెయిల్‌పై విచారణ చేయించుకుని జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఈ మాత్రం మళ్లింపు అవకాశం ఉపయోగించుకోవాలని జగన్‌ న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. తన బెయిల్‌ కోసం ఇంత నాటకాన్ని వెనుకుండి నడిపించిన జగన్‌ భవిష్యత్తులో సాక్షి సిబ్బందిని ఇతర మీడియా నుంచి దూరమయ్యేందుకు తొలిబీజం వేసినట్లే. యాజమాన్యంకు వ్యతిరేకంగా ఇకపై సాక్షి పత్రిక, ఛానల్‌ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడ్డా బయటకు రాలేని పరిస్థితి ఎదురవుతోంది. మరో కోణంలో పరిశీలిస్తే ఈ 15స్థానాల్లో గెలుపొందినందుకే వై.కా.పా. నేతలు ఆంధ్రజ్యోతి, ఈనాడు, క్రైమ్‌రిపోర్టర్లను బెదిరిస్తే భవిష్యత్తులో అసెంబ్లీలో అధికారపక్షంగా మారితే ఇక దాడులు ఊహి(భరి)ంచగలమా అన్న కొత్తప్రశ్నకు ఈ సంఘటన పునాది అయింది.

By
en-us Political News

  
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
హైదరాబాద్ నగరంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల నేపథ్యంలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.