జగన్ అరెస్టుతో నిజంగా అలర్లు జరుగుతాయా?
Publish Date:May 25, 2012
Advertisement
తనను మరో రెండు రోజులలో అరెస్టు చేస్తారంటూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించడం ప్రజలలో ఆసక్తి వ్యక్తం అవుతోంది. తనను అరెస్టు చేస్తారని ప్రకటించడమే కాకుండా తన అరెస్టు ఆసరా చేసుకొని రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి ప్రభుత్వం పరంగా కుట్ర జరుగుతుందని చేసిన ప్రకటన పట్ల ప్రజలలో పెద్దగా స్పందన కనిపించడం లేదు. నిజానికి జగన్ అరెస్టు అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హడావుడి చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. సాక్షిపత్రిక అకౌంట్లు సీజ్ చేసిన సమయంలో తమపార్టీ కార్యకర్తలు, ప్రజలే ఆందోళన చేసి పత్రికను రక్షించుకొంటారని జగన్ స్వయంగా ప్రకటించడమే కాకుండా ఆయన ప్రకటన ప్రకారమే ఆపార్టీకి చెందిన కార్యకర్తలు రోడ్లు ఎక్కారు. అదే తరహాలో జగన్ ను అరెస్టు చేసిన సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా వుంటారనే ప్రజలు భావిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా జగన్ తనను అరెస్టు చేసి ప్రభుత్వమే విధ్వంసం సృష్టిస్తుందని ప్రకటించడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాస్థుల కేసువిషయమై మే 28వ తేదీన విచారణకు రావలసిందిగా సిబిఐ కోర్టు జగన్ కు సమన్లు పంపింది. జగన్ కోర్టుకు హాజరైన వెంటనే ఆయనను విచారించడానికి అనుమతించవలసిందిగా సిబిఐ అధికారులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసే అవకాశం వుందని భావించారు. అయితే 28వ తేదీ వరకు వేచి వుండకుండానే 25 నాటికే విచారణకు అనుమతించాలని కోరడం ద్వారా సిబిఐ ప్రజలలో మరింత ఆసక్తిని కలిగింది.
http://www.teluguone.com/news/content/jagan-arrest-24-14306.html





