అధికారం రావడం కంటే అడ్డంకులు వైఫల్యాలే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి జగన్‌ని. 2019 లో అధికా రంలోకి వచ్చినప్పడు ఆ మొదటి సంవత్సరం సరదాగా గడిపేసేడు. ఆ తర్వాత 2020లో కరోనా పుణ్యమాని పిల్లలకు పరీక్షలు నిర్వహించుకుండానే పైతరగతులకు ప్రొమోట్ చేసేరు. ఈ విధంగా విద్యా శాఖ పరంగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా గడిచిపోయిందనుకున్నారు అధికారులు కూడా. కరోనా ఆ విధంగా కొంత వుప శమనం కల్గించింది. 2021లో కూడా అలాగే గడిచిపోయింది.
ఇప్పుడు 2022లో జగన్ ప్రభుత్వం తొలిసారిగా టెన్త్ పరీక్షలు నిర్వహించింది. కరోనా అవరోధాన్ని అధిగమించి నిర్వహించిన టెన్త్ పరీక్షల మొదటి రోజునే పేపర్ లీక్ అయిందని అన్నారు. అందుకు నారాయణ విద్యాసంస్థనే తప్పపట్టారు. ఆయన్ను ఏకంగా అరెస్టు చేసేరు. కానీ ఆ లీకేజీ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నది ఇంతవరకూ తేలనే లేదు. లీకులన్నీ వైసీపీవారి వాట్సాప్ లలోనే జరిగాయన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. మొదటిసారి నిర్వహిస్తున్న పరీక్షల్లో ఇలాంటి గందర గోళంతో పరువు పొగొట్టుకుంది జగన్ ప్రభుత్వం. ఆ అవరోధం దాటి పిల్లల తలి దండ్రులు శభాష్ అంటారని అనుకున్నారు. కానీ జరిగిందేమిటి? అవక తవకలు జరిగేయోమెనన్న అనుమానాలు అందరినీ వెంటాడాయి. కాదని చెప్పుకోవడానికి ప్రభు త్వం నానా కంగాళీ అయింది.
ఫలితాల ప్రకటన కూడా కాస్తంత ఆలస్యం జరిగింది. దీనిమీద కూడా అనుమానాలు వెల్లువెత్తాయి. బొత్స వంటి సీనియర్ విద్యాశాఖ మంత్రిగా వున్నా ఆలస్యం జరగడమేమిటనుకున్నారు. మొత్తానికి సోమవారం ప్రకటించేరు. ఫలితాల్లో అవకతవకలు వెలుగు చూశాయి. పాస్ పర్సంటేజి బాగా తగ్గడం కూడా పలు అనుమానాలకు దారితీసింది.
అసలు పాసు మార్కులు రాని విద్యార్ధి ఏకంగా టెన్త్ పాసయిపోవడం! ఇదెలా సాధ్యం అంటే టెక్నికల్ ప్రాబ్లమ్ అని సదరు శాఖ అధికారులు అని చేతులు దులిపేసుకోవచ్చు.
కానీ ఇలాంటి పొరపాట్లే ప్రభు త్వం పరువు నట్టేట ముంచేది. ఘోరమయిన తప్పిదాలు జరిగితే ఎలా? విద్యార్ధులు బాగా చదివి మంచి మార్కు లతోనో, రమారమి మార్కులతోనో పాస్‌కావడం వేరు. పాస్ కావడానికి అవకాశం లేని విద్యార్ధి పాస్ అయిపోవడం జరిగిపోయింది. విజయవాడకు చెందిన ఓ విద్యార్థికి మొత్తం 170 మార్కులే రావడం..అయినా అతడు పాస్ అయినట్లు పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ఆరు పేపర్ల లెక్క తీసు కున్నా.. సబ్జెక్టుకు 35 చొప్పున 210 మార్కులు వస్తేనే పాస్. కానీ విద్యార్థి అంతకంటే తక్కువ స్కోర్ చేశాడు. అంతేకాదు.. సోషల్ స్టడీస్ లో 11 మార్కులు లెక్క్లల్లో 17 మార్కులు వచ్చాయి. ఎలా చూసినా ఫెయిలే. కానీ పాస్ అంటూ ఫలితాల్లో పేర్కొన్నారు. జగన్ పాలనలో ఏదీ సవ్యంగా జరగడం లేదన్నదానికి ఇదో పెద్ద వుదాహరణ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-19th-faik-25-137224.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.